News November 15, 2024
బోరుగడ్డ అనిల్ వివాదం.. మరోసారి పోలీసులు సస్పెండ్

గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ గురువారం అరండల్ పేట పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశారు. బోరుగడ్డ అనిల్ అరండల్ పేట పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్న సమయంలో అధికారులు నిబంధనలను ఉల్లంఘించి అనిల్ మేనల్లుడిని లోనికి అనుమతించారు. ఈ అంశంలో హెడ్ కానిస్టేబుళ్లతో పాటూ ఒక కానిస్టేబుల్ ప్రమేయం ఉండటంతో సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
Similar News
News January 15, 2026
సైనికుల ఖార్ఖానా.. బావాజీపాలెం

నేడు జాతీయ సైనిక దినోత్సవం. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బావాజీపాలెం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనిని ‘జవాన్ల ఊరు’గా పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరు సైన్యంలో పనిచేస్తుండటం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం నుంచి నేటి వరకు ఇక్కడి వారు దేశసేవలో తరిస్తున్నారు. యువత ఉదయాన్నే మైదానంలో కసరత్తులు చేస్తూ, ఆర్మీలో చేరడమే ఏకైక లక్ష్యంగా శ్రమిస్తుంటారు.
News January 15, 2026
GNT: రంగస్థల దిగ్గజం మొదలి నాగభూషణశర్మ

గుంటూరు (D) ధూళిపూడిలో 1935 జులై 24న జన్మించిన మొదలి నాగభూషణశర్మ, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం, అమెరికాలోని ఇల్లినాయిస్ వర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించారు. సుమారు 70కి పైగా నాటకాలు, నాటికలు, రేడియో నాటికలు రచించారు. సాహిత్యం, నాటక రంగాలకు ఆయన చేసిన సేవలకుగాను ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం (2013) వంటి ఎన్నో అవార్డులు వరించాయి. 2019 జనవరి 15న తెనాలిలో మరణించారు.
News January 15, 2026
సంక్రాంతి.. కోళ్లను ఇలా గుర్తించండి

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చరిత్రలో కోడి పందేలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈకల రంగు, కాళ్ల రంగు, కళ్ల రంగును బట్టి వాటిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
#డేగ: ఎరుపు రంగు ఈకలు కలిగినవి.
#కాకి: నలుపు రంగు ఈకలు కలిగినవి.
#నెమలి: పచ్చని రంగు ఛాయ కలిగినవి.
#పర్ల: తెలుపు రంగు ఈకల మీద నల్లటి మచ్చలు ఉన్నవి.
#అబ్రాస్: ఎరుపు, తెలుపు, నలుపు కలిసిన మిశ్రమ రంగు.
#సేతు: పూర్తిగా తెల్లగా ఉండే కోడి.


