News November 15, 2024
ఈ ప్రాంతాల్లో వర్షాలు
AP: ఈరోజు కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అటు అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్సుందని HYD IMD పేర్కొంది.
Similar News
News November 15, 2024
మాంసంతో పాల ఉత్పత్తులు తినకూడదా?
చికెన్, మటన్, ఫిష్ కూరలతోపాటు పాల ఉత్పత్తులు తినకూడదనే మాట మనం వింటూ ఉంటాం. దీనివల్ల వికారం, డైజేషన్ సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే అదంతా ఉత్తిదేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘ఇలా తినడం హానికరమనే దానికి శాస్త్రీయత లేదు. మాంసం, డైరీ ఉత్పత్తుల నుంచి ప్రొటీన్లు, కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి శరీరం ప్రత్యేక ఎంజైమ్‌లను ఉపయోగిస్తుంది. కాబట్టి జీర్ణక్రియలో సమస్యలు ఉండవు’ అని పేర్కొంటున్నారు.
News November 15, 2024
ఇరాన్ అంబాసిడర్‌తో ఎలాన్ మస్క్ సీక్రెట్ మీటింగ్!
UNలో ఇరాన్ అంబాసిడర్ ఆమిర్ సయీద్‌తో బిలియనీర్ ఎలాన్ మస్క్ సమావేశమైనట్టు తెలిసింది. సోమవారం న్యూయార్క్‌లో వీరిద్దరూ గంటకు పైగా రహస్యంగా చర్చించారని US మీడియా పేర్కొంది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఉద్రికత్తలు తొలగించేందుకు వీరిద్దరూ చొరవ చూపారని సమాచారం. ఇరాన్ న్యూక్లియర్ ప్రణాళికను ఇష్టపడని అమెరికా కొన్నేళ్లుగా దానిపై ఆంక్షలు విధించింది. వెస్ట్‌ఏషియాలో ఆందోళనను తగ్గించాలని ట్రంప్ భావిస్తున్నారు.
News November 15, 2024
రణ్‌వీర్‌ను నేను వెయిట్ చేయించలేదు: ముకేశ్ ఖన్నా
తన ఆఫీస్‌కి వచ్చిన రణ్‌వీర్ సింగ్‌ను 3 గంటలపాటు వెయిట్ చేయించారన్న వార్తల్ని ‘శక్తిమాన్’ ముకేశ్ ఖన్నా ఖండించారు. ‘ఆయన ఉండాలనుకున్నారు కాబట్టి ఉన్నారు. తనో అద్భుతమైన నటుడు. కానీ శక్తిమాన్ పాత్రలో ఎవరు నటించాలో డిసైడ్ చేయాల్సింది నేను. నిర్మాతలు నటుల్ని ఎంపిక చేయాలి గానీ నటులు నిర్మాతల్ని ఎంపిక చేయరాదు. నా ఆఫీస్‌కి వచ్చి శక్తిమాన్ పాత్ర చేస్తానంటే..? ఒప్పేసుకోవాలా? కుదరదు’ అని తేల్చిచెప్పారు.