News November 15, 2024
బీసీ రిజర్వేషన్లపై రేపటి నుంచి సలహాల స్వీకరణ!

TG: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ రేపటి నుంచి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో ప్రతిరోజు ఉ.11:30 నుంచి మ.3 గంటల వరకు ప్రజల నుంచి సలహాలు, వినతులు స్వీకరించనుంది. రేపు నల్గొండ, ఈనెల 17న ఖమ్మం, 18న మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ విచారణ నిర్వహించనుంది.
Similar News
News November 5, 2025
జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

బంగ్లాదేశ్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ జట్టులోని జూనియర్లను కొట్టిందని మాజీ సహచరురాలు జహనారా ఆలం ఆరోపించారు. కొట్టడం ఆమెకు అలవాటని, దుబాయ్ టూర్లోనూ రూముకు పిలిచి మరీ జూనియర్ని కొట్టిందని చెప్పారు. ICC వరల్డ్ కప్‌లో బంగ్లా టీమ్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో జట్టులోని అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. కాగా ఇవి నిరాధార ఆరోపణలంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు ఖండించింది.
News November 5, 2025
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు: సమాఖ్య ఛైర్మన్

TG: PVT కాలేజీల యాజమాన్యాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన బెదిరిస్తున్నారని సమాఖ్య ఛైర్మన్ రమేష్‌బాబు ఆరోపించారు. ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కోసం 3 రోజులుగా బంద్ కొనసాగుతుండగా చర్చలకు పిలిచి ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని మండిపడ్డారు. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుకు వేసిన కమిటీలో సంబంధం లేని ఇద్దరిని తొలగించాలన్నారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు బంద్ విరమించేది లేదని తేల్చి చెప్పారు.
News November 5, 2025
దేశాన్ని కించపరిచే ప్రయత్నం: రాహుల్‌పై బీజేపీ ఫైర్

హరియాణాలో 25 లక్షల <<18204949>>ఓట్ల చోరీ <<>>జరిగిందన్న రాహుల్ ఆరోపణలపై BJP తీవ్రంగా స్పందించింది. అవి నిరాధార, అసత్య ఆరోపణలని, దేశాన్ని కించపరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడింది. భారత వ్యతిరేక శక్తులతో కలిసి రాహుల్ గేమ్స్ ఆడుతున్నారని కేంద్ర మంత్రి రిజిజు ఫైరయ్యారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే ఈసీని లేదా కోర్టును ఆశ్రయించాలని, కానీ ఆయన అలాంటివి చేయరని ఎద్దేవా చేశారు.


