News November 15, 2024
‘సివిల్స్’కు ఉచిత శిక్షణ.. 24 వరకు దరఖాస్తులు
AP: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రైమరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది. అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 24లోపు బీసీ సంక్షేమ సాధికార కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని తెలిపింది. ఈ నెల 27న నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఉచిత హాస్టల్, భోజన వసతి కూడా ఉంటుంది. బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14% చొప్పున ఎంపిక చేస్తారు.
Similar News
News November 15, 2024
GREAT: ఒక్కడే 8 గవర్నమెంట్ జాబ్స్ కొట్టాడు!
ఈరోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం రావడమే కష్టం. అలాంటిది 8 సర్కారు కొలువులతో సత్తాచాటారు WGL (D) నల్లబెల్లికి చెందిన రాయరాకుల రాజేశ్. కోచింగ్ లేకుండానే ప.సెక్రటరీ, PGT గురుకుల, ASO, TGT గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2, గ్రూప్-4, DSC, JL ఉద్యోగాలు సాధించి ప్రస్తుతం మల్లంపల్లిలో PGT(SOCIAL)గా పనిచేస్తున్నారు. అన్న స్ఫూర్తిగా తమ్ముడు సంతోష్ కూడా గ్రూప్-4 సాధించి, గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు.
News November 15, 2024
కులగణన సర్వే 30% పూర్తి: మంత్రి పొన్నం
TG: కులగణన సర్వే 30% పూర్తయినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. కులగణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదని, సర్వేలో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడగట్లేదని చెప్పారు. కులం వివరాలు చెప్పడం ఇష్టం లేకపోతే 999 ఆప్షన్ ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేటర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News November 15, 2024
శాసనమండలిలో రగడ.. మంత్రి ఆగ్రహం
AP: మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా శాసనమండలిలో రగడ జరిగింది. కాలేజీల నిర్మాణం, సీట్ల కేటాయింపుపై ప్రభుత్వ విధానం చెప్పాలని YCP ఎమ్మెల్సీలు నినదించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. YCP ప్రభుత్వ హయాంలో ప్రచారం చేశారే తప్ప కాలేజీలు కట్టలేదని మండిపడ్డారు. 26జిల్లాల్లో కాలేజీల పేరుతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పార్టీ ఆఫీసులు కట్టారని ఆరోపించారు. అనంతరం YCP సభ్యులు వాకౌట్ చేశారు.