News November 15, 2024
గొల్లప్రోలు: అత్తమామల వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
భర్త, అత్తమామల వేధింపులు భరించలేక ఓ వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకుంది. తుని SI శ్రీనివాసరావు వివరాల మేరకు.. గొల్లప్రోలుకు చెందిన దివ్య రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందన్నారు. గర్భం దాల్చిన ఆమెను చికిత్స నిమిత్తం పిఠాపురంలో ఓ ఆసుపత్రికి అతని మావయ్య తీసుకెళ్లారు. ఆయన బయటకు వెళ్లొచ్చేసరికి కనిపించలేదు. పోలీసుల విచారణలో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
Similar News
News November 15, 2024
తూ.గో: శివనామస్మరణతో మారుమొగుతున్న శైవక్షేత్రాలు
కార్తీకపౌర్ణమి సందర్భంగా తూ.గో. జిల్లాలో ఆధ్మాత్మిక శోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సామర్లకోట, ఐ.పోలవరం, ఆత్రేయపురం, అన్నవరం, రాజమండ్రి, తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మహిళలు వత్తులు వెలిగించడంతోపాటు ఆలయ పరిసరాల్లోని కోనేటిలో దీపాలను వదులుతూ తమ కోర్కెలు నెరవేరాలని మహాదేవుడ్ని ప్రార్థిస్తున్నారు.
News November 15, 2024
తూ.గో: నటుడు పోసానిపై పలుచోట్ల ఫిర్యాదులు
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని తుని, అనపర్తి, ముమ్మిడివరం మండలాల్లో గురువారం ముగ్గురు ఫిర్యాదులు చేశారు. తునిలో వెంకటేశ్వరస్వామి భక్తుడు శివాజీ, అనపర్తిలో TV5 ప్రతినిధి మణికంఠ, జర్నలిస్ట్ రమేశ్ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. నటుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు.
News November 15, 2024
తూ.గో: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..మరొకరికి గాయాలు
రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలోని హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానిక SI మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు నేవీ డిపర్ట్మెంట్కు చెందిన ముగ్గురు మినీ లారీలో వైజాగ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనలో త్రిపాఠి, షైబాజ్ మరణించగా..నగేశ్కి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.