News November 15, 2024

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: ప్రభుత్వ స్కూళ్ల ఆవరణల్లో వివాహాలు, రాజకీయ, మతపరమైన సమావేశాలను నిషేధిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. పాఠశాలల పనివేళలకు ముందు, తర్వాత, సెలవుల్లో ఇలాంటి కార్యక్రమాలకు ఆర్జేడీలు, డీఈవోలు, HMలు అనుమతిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

Similar News

News November 15, 2024

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే: బాంబే హైకోర్టు

image

అంగీకారంతో మైనర్ భార్య(18 ఏళ్లలోపు)తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితునికి కింది కోర్టు విధించిన 10ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది. MH వార్ధాలో ఓ వ్యక్తి మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకుని పెళ్లిచేసుకున్నాడు. తర్వాత విభేదాలు రావడంతో ఆమె రేప్ కేసు పెట్టింది. ఈ కేసు సమర్థనీయమేనని కోర్టు అభిప్రాయపడింది.

News November 15, 2024

ధాన్యం సేకరించిన వారంలోపే బోనస్: మంత్రి

image

TG: సన్న రకాల ధాన్యం పండించిన రైతులకు ₹500 బోనస్ కచ్చితంగా ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన వారంలోపే చెల్లిస్తామన్నారు. సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా కూడా ఇస్తామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. హరీశ్ రావు, KTR రైతులను రెచ్చగొడుతున్నారని, రైతుల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.

News November 15, 2024

జగన్ ఆర్థిక ఉగ్రవాది: మంత్రి పయ్యావుల

image

AP: ఐదేళ్ల పాలలో జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, ఆయనొక ఆర్థిక ఉగ్రవాది అని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో విమర్శించారు. రాష్ట్ర సంపద పెంచకుండా విపరీతంగా అప్పులు చేశారని దుయ్యబట్టారు. ‘బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో అనేకమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారు. పోలవరం పనులు నిలిపేసి డయాఫ్రంవాల్ డ్యామేజీకి జగన్ కారణమయ్యారు’ అని ఆరోపించారు.