News November 15, 2024
కస్తూరికి ముందస్తు బెయిల్ నిరాకరణ

తెలుగువారిపై <<14525601>>వివాదాస్పద<<>> వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తనపై తమిళనాడులో పలు కేసులు నమోదైన నేపథ్యంలో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. కస్తూరి మాటలు విద్వేషపూరితమేనని, తెలుగువారిని కించపర్చడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారెవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా ఆమె పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News February 17, 2026
ఫిబ్రవరి 17: చరిత్రలో ఈరోజు

1883: స్వాతంత్ర్య సమరయోధుడు వాసుదేవ బల్వంత ఫడ్కే మరణం
1954: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జననం
1963: అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్ జననం
1983: సినీ రచయిత పాలగుమ్మి పద్మరాజు మరణం
1984: క్రికెట్ ప్లేయర్ డివిలియర్స్ జననం
1984: సినీ నటి సదా జననం
1986: తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మరణం
2000: మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 ఓఎస్ విడుదల
News February 17, 2026
పాక్‌లో ‘Money Heist’.. 700 తులాల బంగారం చోరీ!

పాకిస్థాన్‌లోని కరాచీలో ‘మనీ హీస్ట్’ తరహా భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలో 300 మిలియన్ల PKR విలువైన బంగారాన్ని దుండగులు దోచుకున్నారు. షాపు వెనుక నుంచి రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారని పోలీసులు తెలిపారు. 700 తులాల బంగారు కడ్డీలు, ఆభరణాలు ఎత్తుకెళ్లారని యజమాని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దొంగలకు ఈ ప్రాంతంపై పట్టుందని, ఓ సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.
News February 17, 2026
సినీ నటి ప్రత్యూష మృతి కేసు.. నేడే తుది తీర్పు

2002లో <<18340301>>సంచలనం సృష్టించిన<<>> సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థరెడ్డి వేసిన అప్పీల్, అతడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును గతేడాది నవంబర్‌లో SC రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో 24 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.


