News November 15, 2024
లిక్కర్ బ్యాన్ కొత్త తరహా నేరాలకు కారణమైంది: పట్నా హైకోర్ట్
బిహార్‌లో అమలవుతున్న మద్యపాన నిషేధంపై పట్నా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది కొత్త తరహా నేరానికి కారణమవుతోందని, కొందరికి వరంలా మారిందని వ్యాఖ్యానించింది. మంచి ఉద్దేశంలో అమలు చేస్తున్న లిక్కర్ బ్యాన్ కొందరు తాము లాభపడేందుకు మద్దతిచ్చారని పేర్కొంది. ముకేశ్ కుమార్ పాశ్వన్ అనే పోలీసును లిక్కర్ వ్యవహారంలో డిమోట్ చేయగా, అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ క్రమంలో కోర్టు పైవిధంగా స్పందించింది.
Similar News
News November 15, 2024
రుషికొండ ప్యాలెస్ చూస్తే నాకే కళ్లు తిరుగుతున్నాయి: సీఎం
AP: గత ప్రభుత్వం సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. రూ.431 కోట్ల ప్రజాధనంతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారని, దాన్ని చూస్తే తనకే కళ్లు తిరుగుతున్నాయని చెప్పారు. ‘రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకున్నారు. సాక్షికి రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. రూ.500 కోట్లు ఖర్చు చేసి ఉంటే రోడ్లు బాగయ్యేవి’ అని పేర్కొన్నారు.
News November 15, 2024
అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ.300కోట్లు?
‘పుష్ప-2’ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు అల్లు అర్జున్ రూ.300కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇది షారుఖ్, దళపతి విజయ్, ప్రభాస్ తీసుకుంటున్న దానికంటే ఎక్కువని తెలిపింది. దీంతో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న యాక్టర్‌గా ఐకాన్ స్టార్ నిలిచారని వివరించింది. DEC5న థియేటర్లలోకి రాబోతున్న ‘పుష్ప-2కు’ నార్త్‌లో భారీగా కలెక్షన్స్ వస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News November 15, 2024
ప్రభుత్వ అస్థిరతకు BJP, BRS కుట్ర: మంత్రి శ్రీధర్ బాబు
TG: తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింపతీ కోసమే కేటీఆర్ పదేపదే అరెస్టు అంటున్నారని, ఆయన అరెస్టుకు తాము కుట్ర చేయలేదని తెలిపారు. లగచర్లలో అధికారులపై హత్యాయత్నం జరిగిందని, రైతుల ముసుగులో కొందరు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.