News November 15, 2024

‘లాంగెస్ట్ సర్‌నేమ్’ క్రికెటర్‌కు 103 ఏళ్లు

image

క్రికెట్‌లో పలు రికార్డులతో చరిత్రలో నిలిచిపోవడం సహజం. కానీ ఫిజీకి చెందిన ఓ క్రికెటర్ లాంగెస్ట్ సర్‌నేమ్‌తో వరల్డ్ ఫేమస్. అతని పేరు Ilikena Lasarusa Talebulamainavaleniveivakabulaimainakulalakebalau. IL బులా అని పిలుస్తారు. ఆ పేరుకు ‘లావ్ గ్రూప్‌ లకెంబా ద్వీపంలోని నంకుల ఆస్పత్రి నుంచి సజీవంగా తిరిగి వచ్చాడు’ అని అర్థం. 1921 NOV 15న పుట్టిన ఇతనికి నేటితో 103 ఏళ్లు. 1947-54 మధ్య 9 మ్యాచ్‌లు ఆడారు.

Similar News

News April 17, 2026

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు

image

మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగులో పాల్గొన్నారు. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. 2/3 <<19675689>>మెజార్టీ<<>>(352) లేకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు..

News April 17, 2026

‘టాక్సిక్’ స్టోరీ లైన్ చెప్పిన యశ్

image

ఇండిపెండెన్స్ సమయంలో గోవాలో జరిగే తండ్రీ కొడుకుల రివేంజ్ డ్రామాగా ‘టాక్సిక్’ తెరకెక్కిందని హీరో యశ్ వెల్లడించారు. లాస్ వేగాస్(US)లో జరిగిన CinemaCon వేడుకల్లో 9 నిమిషాల మూవీ ప్రివ్యూను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం తర్వాత కొన్నేళ్లపాటు గోవాలో కొనసాగిన పోర్చుగీస్ పాలనలో పాలిటిక్స్, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.

News April 17, 2026

హార్ముజ్ ఓపెన్.. చమురు ధరలు క్రాష్

image

హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఐరోపాకు చెందిన బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్ ధర 10.13 డాలర్లు తగ్గి $89.26కు చేరింది. మరోవైపు USకు చెందిన WTI క్రూడ్ $10.45 తగ్గి $84.24కు, UAEకి చెందిన ముర్బాన్ క్రూడ్ 8 డాలర్లు తగ్గి $93.46కు చేరాయి. యుద్ధంతో ఓ దశలో $150కి చేరుతుందనుకున్న చమురు ధర ఇప్పుడు ఈ స్థాయిలో తగ్గడం ఊరటనిస్తోంది.