News November 15, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఖమ్మంలో ఎంపీ రఘురామిరెడ్డి పర్యటన> ఆలయాల్లో కార్తీక పౌర్ణమి పూజలు > దమ్మపేటలో బీఆర్ఎస్ నాయకుల సమావేశం > చర్లలో సీపీఎం మండల మహాసభ > ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు > ముదిగొండలో సహకార సొసైటీ వారోత్సవాలు > భద్రాచలం ఆలయంలో ప్రత్యేక పూజలు> ఖమ్మం గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం > ఖమ్మం గ్రంధాలయంలో ముగ్గుల పోటీలు > రాజేశ్వరపురంలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు

Similar News

News July 6, 2025

ఖమ్మం డీసీసీబీ బంగారు తాకట్టు రుణాలాలో టాప్

image

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బంగారు తాకట్టు రుణాల మంజూరులో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిచింది. 57,519 మంది దాదాపు రూ.765 కోట్ల మేర బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు తీసుకున్నారు. మరో వారంలోగా ఇది రూ.800 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు అనందం వ్యక్తం చేశారు.

News July 6, 2025

ఖమ్మం శ్రీలక్ష్మీ రంగనాథ ఆలయంలో ఏకాదశి వేడుకలు

image

ఖమ్మం రంగనాయకుల గుట్టపై స్వయంభు కరిగిరి శ్రీలక్ష్మీ రంగనాథస్వామి వారి దేవస్థానంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు బూరుగడ్డ శ్రీధరాచార్యులు తెలిపారు. తెల్లవారుజామున 5:30 గంటలకు ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకం, సువర్ణపుష్పార్చన, ఉదయం 9:30కు సుదర్శన హోమం, మధ్యాహ్నం 12 గంటలకు మహా పూర్ణాహుతి ఉంటుందని, భక్తులు సకాలంలో హాజరై, స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు.

News July 5, 2025

విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి: ఖమ్మం కలెక్టర్

image

రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం ఖమ్మం దానవాయిగూడెం, కోయచిలక క్రాస్ రోడ్డులోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. గురుకులంలో చేపట్టాల్సిన మైనర్ మరమ్మతులపై నివేదిక అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.