News November 15, 2024
వారానికి 5 రోజుల పని మంచిది కాదు: నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి హార్డ్ వర్క్‌పై మరోసారి కామెంట్లు చేశారు. తాను రోజులో 14గంటలు కష్టపడేవాడినని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అభివృద్ధి చెందుతున్న ఇండియాలో 5రోజుల పని దినాల విధానం మంచిది కాదన్నారు. హార్డ్ వర్క్‌కు ప్రత్యామ్నాయం లేదని, మీరు అత్యంత తెలివైన వ్యక్తి అయినా కష్టపడాల్సిందేనని చెప్పారు. PM మోదీ వారానికి 100గంటలు పని చేస్తారని దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 15, 2024
కేటీఆర్ అరెస్ట్ అయితే?
‘అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి’ అన్న KTR మాటలు పొలిటికల్ హీట్ పెంచాయి. ఫార్ములా-1 కేసులో KTR అరెస్ట్ ఖాయమంటూ కాంగ్రెస్ పదే పదే చెబుతోంది. మొన్న అర్ధరాత్రి KTR అరెస్ట్ అవుతారని ప్రచారం జరగ్గా, ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే. ఆయన అరెస్టైతే త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అరెస్టే జరిగితే ఏ పార్టీకి లాభం అని అనుకుంటున్నారో COMMENT చేయండి.
News November 15, 2024
కిస్, హగ్ లైంగిక నేరం కాదు: మద్రాస్ హైకోర్టు
లవర్స్ ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం సహజమేనని మద్రాస్ హైకోర్టు తెలిపింది. అది లైంగిక నేరం కిందకు రాదని స్పష్టం చేసింది. 19 ఏళ్ల యువతిని ముద్దు పెట్టుకున్న 21 ఏళ్ల యువకుడిపై కేసు కొట్టేసింది. అవాంఛిత శృంగారం, అందుకు బలవంతపెట్టడమే IPC సెక్షన్ 354-A(1)(i) కిందకు వస్తాయంది. డిన్నర్ డేట్‌కు పిలిచి ముద్దు పెట్టిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో అమ్మాయి కుటుంబం ఈ కేసు పెట్టడం గమనార్హం.
News November 15, 2024
రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో పవన్ ప్రచారం
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో ఎన్డీఏ తరఫు అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నాందేడ్, భోకర్, లాతూర్, సోలాపూర్, చంద్రపూర్, పుణే ప్రాంతాల్లో 5 సభలు, రెండు రోడ్ షోలలో పాల్గొంటారని జనసేన వెల్లడించింది. బీజేపీ జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.