News November 15, 2024
సంగారెడ్డి: విషాదం.. పుట్టినరోజు నాడే విద్యార్థిని మృతి
పటాన్‌చెరు పరిధి ఇంద్రేశంలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఫిలిపియన్స్‌లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్నిగ్ధ అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతి చెందినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి పుట్టినరోజు నాడే ఆమె చనిపోవడం ఆ కుటుంబాన్ని కలిచివేసింది.
Similar News
News November 15, 2024
MDK: 19న ఏడుపాయల నుంచి పాదయాత్ర !
ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై ఉద్యమించడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమవుతున్నాయి. ఈనెల 19వ తేదీన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా-లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి.. ఇతర నాయకులు, రైతులతో కలసి ఏడుపాయల నుంచి మెదక్ వరకు పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
News November 15, 2024
సంగారెడ్డిలో లగచర్ల రైతులను కలవనున్న KTR
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నేడు సంగారెడ్డికి రానున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామానికి చెందిన పార్టీ నాయకులు, రైతులను పరామర్శించనున్నారు. వికారాబాద్ జిల్లా అధికారులపై దాడి ఘటనలో అరెస్టు చేసిన వారిని సంగారెడ్డి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
News November 15, 2024
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ చేస్తున్నారు: మెదక్ ఎంపీ
రాష్ట్రంలో పాలన పడకేసిందని, సీఎం రేవంత్ మాటలకు చేతలకు పొంతన లేదని ఎంపీ రఘునందన్ రావు విమర్శంచారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులే సీఎం రేవంత్ చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఖమ్మం మిర్చి యార్డులో రైతులను అరెస్టు చేసి బేడీలు వేసినప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో అరెస్టుల పర్వం కొనసాగించడం ఎంతవరకు సమంజసమని అన్నారు.