News November 15, 2024
కిడ్నీ పేషెంట్‌కు తమన్ సాయం
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గొప్ప మనసు చాటుకున్నారు. ఓ పేషెంట్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సాయం చేశారు. ఈ విషయాన్ని AINU ఆస్పత్రి వైద్యుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. దీనికి ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అంటూ తమన్ తన ఇన్‌స్టా స్టోరీలో రిప్లై ఇచ్చారు. దీంతో పలువురు ఆయన సేవాగుణాన్ని ప్రశంసిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి.
Similar News
News November 15, 2024
యజమాని సగం ముఖాన్ని పీకేసిన కుక్క!
పెంపుడు శునకాల్లో పిట్ బుల్ కుక్కల్ని అత్యంత ప్రమాదకరమైనవిగా చెబుతుంటారు. అది మరోసారి నిరూపితమైంది. బరేలీకి చెందిన ఆదిత్య శంకర్ అనే వ్యక్తి పిట్‌బుల్‌ను పెంచుకుంటున్నారు. తాజాగా ఆ కుక్క అతడిపై దాడికి పాల్పడింది. పెదాలు, సగానికి పైగా ముఖాన్ని పీకేసింది. కుటుంబీకులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు సర్జరీ చేశారు. కుక్కను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు మునిసిపల్ అధికారులు తెలిపారు.
News November 15, 2024
కూటమి నేతలు అసభ్యకర పోస్టులు పెట్టినా చర్యలు: సీఎం
AP: ఆడబిడ్డల రక్షణ బాధ్యత తాము తీసుకుంటామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిందని ఆరోపించారు. ‘కన్నతల్లులను కూడా దూషించేలా పోస్టులు పెట్టారు. వీళ్లు మనుషులేనా? ఎన్డీఏలో కూడా ఏ లీడర్ ఇలాంటి అసభ్యకరపోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టాలకు పదును పెడతాం. నిందితులను ఉక్కుపాదంతో అణచివేస్తాం’ అని హెచ్చరించారు.
News November 15, 2024
అసలు సంగతి పక్కనపెట్టి అదానీ వెంట పడ్డారా?
అదానీ ఇంట్లో BJP, NCP <<14596038>>మీటింగ్<<>> అనగానే మహారాష్ట్రలో 80గంటల ప్రభుత్వంలో అదానీ పాత్రపైనే అంతా ఫోకస్ పెట్టారు. పూర్వ NCP అధినేత శరద్ పవార్ ఇందులో పాల్గొన్నారనే సంగతిపై శీతకన్నేశారు. శివసేనతో పేచీ వచ్చాక రాత్రికి రాత్రే ఫడ్నవీస్ CM, అజిత్ పవార్ DCMగా ప్రమాణం చేశారు. దీనికి ముందు జరిగిందే ఆ మీటింగ్. అందులో Sr పవార్ ఏం మాట్లాడారు? ముందు మోదీనెందుకు కలిశారు? కాకాకు అంతా తెలుసన్న అజిత్ ప్రశ్నలకు బదులేది?