News November 15, 2024

గ్రేప్4 అమలైతే ఢిల్లీ పరిస్థితి ఏంటి?

image

DL రిజిస్ట్రేషన్ గల BS-6 సొంత వాహనాలు, అత్యవసర సరుకు రవాణా కమర్షియల్ వాహనాలనే నగరంలోకి అనుమతిస్తారు. 6-9, 11వ తరగతులకూ <<14615373>>ఆన్‌లైన్ క్లాసులే<<>> ఉండాలని ప్రభుత్వం ప్రకటించే అధికారం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు 50% స్టాఫ్‌నే పిలవాలని ఆదేశించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ, కూల్చివేత పనుల నిషేధం. కాలుష్యం ఇంకా తీవ్రమైతే అన్ని విద్యాసంస్థలూ మూసేయడంతో పాటు అత్యవసర వాహనాలే తిరిగాలనే ఆంక్షలొస్తాయి.

Similar News

News November 15, 2024

కిస్, హగ్ లైంగిక నేరం కాదు: మద్రాస్ హైకోర్టు

image

లవర్స్ ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం సహజమేనని మద్రాస్ హైకోర్టు తెలిపింది. అది లైంగిక నేరం కిందకు రాదని స్పష్టం చేసింది. 19 ఏళ్ల యువతిని ముద్దు పెట్టుకున్న 21 ఏళ్ల యువకుడిపై కేసు కొట్టేసింది. అవాంఛిత శృంగారం, అందుకు బలవంతపెట్టడమే IPC సెక్షన్ 354-A(1)(i) కిందకు వస్తాయంది. డిన్నర్ డేట్‌కు పిలిచి ముద్దు పెట్టిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో అమ్మాయి కుటుంబం ఈ కేసు పెట్టడం గమనార్హం.

News November 15, 2024

రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో పవన్ ప్రచారం

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో ఎన్డీఏ తరఫు అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నాందేడ్, భోకర్, లాతూర్, సోలాపూర్, చంద్రపూర్, పుణే ప్రాంతాల్లో 5 సభలు, రెండు రోడ్ షోలలో పాల్గొంటారని జనసేన వెల్లడించింది. బీజేపీ జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

News November 15, 2024

యజమాని సగం ముఖాన్ని పీకేసిన కుక్క!

image

పెంపుడు శునకాల్లో పిట్ బుల్ కుక్కల్ని అత్యంత ప్రమాదకరమైనవిగా చెబుతుంటారు. అది మరోసారి నిరూపితమైంది. బరేలీకి చెందిన ఆదిత్య శంకర్ అనే వ్యక్తి పిట్‌బుల్‌ను పెంచుకుంటున్నారు. తాజాగా ఆ కుక్క అతడిపై దాడికి పాల్పడింది. పెదాలు, సగానికి పైగా ముఖాన్ని పీకేసింది. కుటుంబీకులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు సర్జరీ చేశారు. కుక్కను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు మునిసిపల్ అధికారులు తెలిపారు.