News November 15, 2024
సూపర్-6 హామీలపై చేతులెత్తేయడం తగదు: ముద్రగడ
AP: సీఎం చంద్రబాబుకు YCP నేత ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. సూపర్-6 హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేయడం తగదన్నారు. వీటిని అమలు చేయాలంటే రూ.కోట్లు కావాలనే సంగతి అప్పుడు మీకు తెలియదా? అని నిలదీశారు. ప్రజల దృష్టి మరల్చడానికి తిరుపతి ప్రసాదం, రెడ్‌బుక్, SM పోస్టింగులపై చర్యలంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం అన్యాయని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2024
మా రిలీజ్‌లు ఉన్నప్పుడే సెంటిమెంట్ మాటలు: నాగవంశీ
తమ సినిమాలు వస్తున్నప్పుడే పోటీ సినిమాలు సెంటిమెంట్ కార్డ్ ప్లే చేస్తుంటాయని నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించారు. ‘మా సినిమాలకు పోటీగా విడుదల చేసే సినిమావాళ్లే తమ కష్టాలు, కన్నీళ్లు గురించి చెబుతుంటారు. మేం రిలీజ్ పెట్టుకున్నప్పుడే ఇలాంటివి ఎందుకు జరుగుతాయో మరి! ఇకపై మేము కూడా సింపతీ మాటలు చెప్పాలేమో’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’కు పోటీగా హనుమాన్ విడుదలైన సంగతి తెలిసిందే.
News November 15, 2024
శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం SCR 8 స్పెషల్ రైళ్లను ప్రకటించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి-కొల్లం, 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లం, ఈ నెల 24, డిసెంబర్ 1న కొల్లం-మౌలాలి, ఈ నెల 20, 27 తేదీల్లో కొల్లం-మచిలీపట్నం మధ్య ఈ 8 సర్వీసులు తిరుగుతాయని వెల్లడించింది. పైన ఫొటోలో రైలు టైమింగ్స్, హాల్టింగ్స్ వివరాలు చూడొచ్చు.
News November 15, 2024
‘కంగువ’ థియేటర్లలో సౌండ్ తగ్గింపు?
నిన్న విడుదలైన కంగువ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆడియో చాలా లౌడ్‌గా, ఇబ్బందిగా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రెసూల్ సైతం దీనిపై పెదవి విరిచారు. పెద్ద సినిమాలు సౌండ్ డిజైనింగ్ లౌడ్‌నెస్ యుద్ధంలో చిక్కుకుంటున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ‘కంగువ’ థియేటర్లలో సౌండ్ తగ్గించాలని ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా సూచించినట్లు తెలుస్తోంది.