News November 15, 2024
లగచర్ల కేసు నిందితులతో కేటీఆర్ ములాఖత్

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టయి సంగారెడ్డి జైలులో ఉన్న వారితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిన్న 16 మంది నిందితులను పోలీసులు కంది సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, 500 మీటర్ల పరిధి వరకూ ఎవరినీ అనుమతించడం లేదని సమాచారం.
Similar News
News November 11, 2025
‘ఓం శాంతి శాంతి శాంతిః’ అంటే అర్థం తెలుసా?

ప్రతి మంత్రాన్ని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అని ముగిస్తుంటాం. అంటే సమస్త దుఃఖాల నుంచి విముక్తి ప్రసాదించమని ఈశ్వరుడిని వేడుకోవడం. ఇందులో మూడు సార్లు ‘శాంతిః’ అని పలకడం ద్వారా మానవులను పీడించే త్రివిధ తాపాల నుంచి ఉపశమనం కోరడం. ఈ మూడు రకాల బాధలను దాటినప్పుడే మనకు మోక్షం, శాంతి లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి. ☞ మరి ఆ మూడు రకాల తాపాలేంటి?, వాటి నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 11, 2025
అనారోగ్యం దూరమవ్వాలంటే?

త్రివిధ తాపాల్లో మొదటిది ఆధ్యాత్మిక తాపం. ఈ బాధలు మనకు శరీరం, మనస్సు వలన అంతర్గతంగా కలుగుతాయి. అనారోగ్యం, సోమరితనం, కోరికలు, కోపం, అహంకారం వంటి దుర్గుణాలు ఇందులోకి వస్తాయి. ఈ బాధల నుంచి విముక్తి పొందడానికి ధ్యానం ఉత్తమ మార్గం. యోగాభ్యాసం, మనస్సుపై ఏకాగ్రత, ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా అంతరంగంలో శాంతిని పొందవచ్చు. స్వీయ నియంత్రణ సాధించి, దుర్గుణాలను జయిస్తే ఆధ్యాత్మిక దుఃఖాలు తొలగిపోతాయి.
News November 11, 2025
విద్యార్థులకు గుడ్ న్యూస్?

TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి 5వ తరగతిలోనూ ప్రవేశాలు కల్పించే అవకాశముంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధమైంది. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. సీట్ల కేటాయింపు, ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణపై త్వరలోనే క్లారిటీ రానుంది. ప్రస్తుతం 6 నుంచి ఇంటర్ వరకు అడ్మిషన్లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.


