News November 15, 2024

జర్నలిస్టుపై కోర్టుకు వెళ్తా: ఇమానే ఖెలీఫ్

image

అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్ పుట్టుకతో పురుషుడేనని తేలినట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికపై ఇటలీ PM మెలోనీ సైతం ఖెలీఫ్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఈ వివాదంపై బాక్సర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఆ జర్నలిస్టుపై నేను కోర్టుకు వెళ్లనున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు నన్ను, నా కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News December 31, 2025

వారెన్ బఫెట్ వీడ్కోలు: వ్యాపార దిగ్గజాలు నేర్చుకున్న పాఠాలివే!

image

బెర్క్‌షైర్ హాత్‌వే CEOగా వారెన్ బఫెట్ తన సుదీర్ఘ ప్రస్థానాన్ని నేటితో ముగించనున్నారు. 95 ఏళ్ల వయసున్న ఈ పెట్టుబడి దిగ్గజం నుంచి నేర్చుకున్న పాఠాలను వ్యాపారవేత్తలు గుర్తుచేసుకుంటున్నారు. క్లిష్టమైన విషయాలను సరళంగా చెప్పడం, ఓపికతో లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్ చేయడం బఫెట్ ప్రత్యేకత. డబ్బు కంటే నైతికతకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. సంపద మనిషిని బందీ చేయకూడదని నమ్మి.. తన ఆస్తిని దానధర్మాలకు కేటాయించారు.

News December 31, 2025

APPLY NOW: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 18 పోస్టులు

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<>HAL<<>>) నాసిక్‌లో 18 ఎక్స్ సర్వీస్‌మెన్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిప్లొమా, ఇంటర్ అర్హత కలిగి, ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌లో పని చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. జనవరి 11న రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in

News December 31, 2025

శివలింగం ధ్వంసం కేసులో కీలక మలుపు

image

AP: కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలోని కపాలేశ్వర స్వామి <<18714825>>శివలింగం<<>> ధ్వంసం చేసిన ఘటనలో కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. CCTV ఫుటేజ్ ఆధారంగా తోటపేటకు చెందిన ఓ యువకుడిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయ అర్చకుడితో జరిగిన వ్యక్తిగత వివాదం కారణంగానే శివ లింగం ధ్వంసం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం కూడా సీరియస్ అయ్యారు.