News November 15, 2024

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే: బాంబే హైకోర్టు

image

అంగీకారంతో మైనర్ భార్య(18 ఏళ్లలోపు)తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితునికి కింది కోర్టు విధించిన 10ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది. MH వార్ధాలో ఓ వ్యక్తి మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకుని పెళ్లిచేసుకున్నాడు. తర్వాత విభేదాలు రావడంతో ఆమె రేప్ కేసు పెట్టింది. ఈ కేసు సమర్థనీయమేనని కోర్టు అభిప్రాయపడింది.

Similar News

News January 7, 2026

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్?

image

APలో మరో మెగా DSCకి రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది 9వేల మందికిపైగా టీచర్లు రిటైర్ కానున్నారు. అలాగే 9,200 ప్రైమరీ స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా మార్చిన తర్వాత ఉపాధ్యాయులు అవసరమని అధికారులు గుర్తించారు. దీంతో FEB రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈసారి DSCలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్‌ పరిజ్ఞానంపై ఓ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు సమాచారం.

News January 7, 2026

‘MSVG’ ప్రమోషన్లకు దూరంగా చిరు.. అందుకేనా?

image

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల వెన్నెముక భాగంలో చిన్న సర్జరీ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. నొప్పి నుంచి రిలీఫ్ కోసం HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారని టాక్. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్లకు నేరుగా హాజరు కావడం లేదని టీటౌన్ వర్గాల్లో డిస్కషన్. త్వరలో జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

News January 7, 2026

రాష్ట్రంలో 1095 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

AP: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 1095 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగల మహిళలు JAN 20 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, BCom, BSc, BEd, MA, ఇంటర్+ ANM ఉత్తీర్ణులు అర్హులు. మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: vizianagaram.ap.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.