News November 15, 2024

కూటమి నేతలు అసభ్యకర పోస్టులు పెట్టినా చర్యలు: సీఎం

image

AP: ఆడబిడ్డల రక్షణ బాధ్యత తాము తీసుకుంటామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిందని ఆరోపించారు. ‘కన్నతల్లులను కూడా దూషించేలా పోస్టులు పెట్టారు. వీళ్లు మనుషులేనా? ఎన్డీఏలో కూడా ఏ లీడర్ ఇలాంటి అసభ్యకరపోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టాలకు పదును పెడతాం. నిందితులను ఉక్కుపాదంతో అణచివేస్తాం’ అని హెచ్చరించారు.

Similar News

News November 15, 2024

హీరో విడాకుల కేసు.. కోర్టు ఏమందంటే?

image

హీరో జయం రవి, ఆర్తి విడాకుల కేసుపై చెన్నై కోర్టులో విచారణ జరిగింది. రవి నేరుగా కోర్టుకు రాగా ఆర్తి వర్చువల్‌గా హాజరయ్యారు. ఇరువురి లాయర్ల వాదనలు విన్న న్యాయస్థానం మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని చెప్పింది. రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించింది. విడిపోవడమే సబబు అనుకుంటే కచ్చితమైన కారణాన్ని తెలియజేయాలని పేర్కొంది. కాగా 2009లో పెళ్లి చేసుకున్న రవి, ఆర్తికి ఇద్దరు పిల్లలున్నారు.

News November 15, 2024

ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి మోదీ

image

ఝార్ఖండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని మోదీ శుక్ర‌వారం ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. ముందుగా ఆయ‌న ప్ర‌యాణించాల్సిన విమానంలో <<14619050>>సాంకేతిక లోపం<<>> తలెత్తింది. దీంతో ఆయన దేవ్‌ఘర్ విమానాశ్ర‌యంలో వేచిచూడాల్సి వచ్చింది. కొంత స‌మ‌యం త‌రువాత కూడా స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో చివరికి ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి బ‌య‌లుదేరారు. మోదీ విమానంలో సమస్య కారణంగా ఇతర విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ ఆలస్యమైంది.

News November 15, 2024

మీలాంటి బాస్‌ల వల్లే ఉద్యోగులు చస్తున్నారు: నారాయణ మూర్తిపై నెటిజన్ల ఫైర్

image

భారత్‌లో వారానికి 5 రోజుల పని విధానం నిరాశపరిచిందని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను తాను నమ్మనని పేర్కొన్న ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆయనలాంటి వారివల్లే వర్క్ ప్లేసెస్ టాక్సిక్ అవుతున్నాయని అంటున్నారు. ఈవై కంపెనీలో వీకాఫ్ లేకుండా కొన్నినెలలు రోజుకు 14 గంటలు పనిచేస్తూ ఉద్యోగి మరణించడాన్ని గుర్తుచేస్తున్నారు. అలాంటి చావులకు ఇలాంటి బాస్‌లే కారణం అంటున్నారు. మీ కామెంట్.