News November 15, 2024
తిరుమల శ్రీవారికి 15 బైకుల అందజేత

తిరుమల శ్రీవారికి ఒంగోలు వాసులు ఎలక్ట్రిక్ స్కూటర్లను వితరణగా ఇచ్చారు. పియరల్ మినరల్ అండ్ మైన్స్ కంపెనీ ఎండీ వెంకట నాగరాజ దాదాపు రూ.25 లక్షల విలువైన 15 బైకులను అందజేశారు. ఈ సందర్భంగా వాటికి ఆలయం ముందు పూజలు చేశారు. దాతలకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 7, 2025
ప్రకాశం: భారీగా పెరిగిన పొగాకు ధర.. కానీ!

ప్రకాశం జిల్లాలో పొగాకు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10న వేలం ప్రారంభమప్పుడు గరిష్ఠ ధర KG రూ.280గా ఉంది. తర్వాత క్రమంగా పెరిగింది. తుఫాన్ ముందు రూ.315 ఉండగా వారం లోపే ప్రస్తుతం రూ.362కి చేరింది. వేలం ముగింపు వేళ ధర పెంచి.. వచ్చే సీజన్లో రైతులు ఎక్కువ సాగు చేసేలా కంపెనీలు కుట్రలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. హైగ్రేడ్ ధరలు పెరిగినప్పటికీ లోగ్రేడ్ కేజీ రూ.150 నుంచి రూ.50కి పడిపోవడం గమనార్హం.
News November 7, 2025
మర్రిపూడి: ఆలయ పునర్నిర్మాణానికి రూ.3.55 కోట్ల ప్రతిపాదనలు

మర్రిపూడి మండలంలో ఉన్న పృదులగిరి దేవస్థానం పునర్నిర్మాణం కోసం రూ.3.55 కోట్లు మంజూరు కోసం రాష్ట్ర మంత్రి స్వామి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పవిత్ర పుణ్య క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని దశాబ్దాలుగా భక్తులు కోరుతున్నారు. ఈ ఏడాది ఘాట్ రోడ్ నిర్మాణానికి రూ.4 కోట్లు నిధులు మంజూరు చేయించగా.. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణానికి రూ.3.55 కోట్లు ప్రతిపాదనలు పంపించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News November 6, 2025
ప్రకాశం జిల్లాలో 213 వాహనాలకు జరిమానా

ప్రకాశం వ్యాప్తంగా బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2,044 వాహనాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 213 వాహనాలను గుర్తించి రూ.1.56లక్షల జరిమానా విధించారు. డ్రైవింగ్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు.


