News November 15, 2024
‘కంగువ’ థియేటర్లలో సౌండ్ తగ్గింపు?

నిన్న విడుదలైన కంగువ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆడియో చాలా లౌడ్‌గా, ఇబ్బందిగా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రెసూల్ సైతం దీనిపై పెదవి విరిచారు. పెద్ద సినిమాలు సౌండ్ డిజైనింగ్ లౌడ్‌నెస్ యుద్ధంలో చిక్కుకుంటున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ‘కంగువ’ థియేటర్లలో సౌండ్ తగ్గించాలని ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా సూచించినట్లు తెలుస్తోంది.
Similar News
News January 14, 2026
విజయ్ మాతో పొత్తు పెట్టుకో.. బీజేపీ ఆఫర్

తమిళనాడులో తమతో పొత్తు పెట్టుకోవాలని TVK పార్టీని బీజేపీ ఆహ్వానించింది. వచ్చే ఎన్నికల్లో DMK గెలిచే అవకాశమే లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాల్సిన అవసరం ఉందని BJP నేత అన్నామలై అన్నారు. డీఎంకే వ్యతిరేక పార్టీలన్నీ కలవాల్సిన అవసరం ఉందని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కాగా బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని అంతకుముందు TVK డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తేల్చి చెప్పారు.
News January 14, 2026
ఫేక్ రిఫండ్లతో ₹5 కోట్లు కొల్లగొట్టాడు

e-కామర్స్ ప్లాట్‌ఫాంల రిటర్న్ సిస్టమ్ లూప్‌హోల్స్‌ను ఆసరా చేసుకొని ఓ యువకుడు రిఫండ్ కింద ఏకంగా ₹5Cr కొల్లగొట్టాడు. చైనాలో లూ అనే వ్యక్తి కాస్మొటిక్ షాపింగ్ ప్లాట్‌ఫాంలో 11900 ఫేక్ రిఫండ్ రిక్వెస్టులు పెట్టాడు. తనకు వచ్చిన వస్తువుల్ని తిరిగి సెకండ్స్ కింద మార్కెట్లో అమ్మేవాడు. 2024లో రిఫండ్‌లపై అనుమానంతో ఓ కంపెనీ ఫిర్యాదు చేయగా స్కామ్ బయటపడింది. చివరకు కోర్టు అతనికి 6ఏళ్ల జైలుశిక్ష విధించింది.
News January 14, 2026
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నం.1

విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానం దక్కించుకున్నారు. ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్న అతడు ICC తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ను వెనక్కి నెట్టి నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్‌కి చేరారు. రోహిత్ శర్మ మూడో ర్యాంకుకు పడిపోయారు. గిల్-5, శ్రేయస్-10 స్థానంలో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 28,068 రన్స్‌తో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా 34,357 పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉన్నారు.


