News November 15, 2024
రేపు కడప దర్గాకు రానున్న ఏఆర్ రెహమాన్

ప్రముఖ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప పెద్ద దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలలో భాగంగా గంధం వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ దర్గాలో జరిగే ప్రతి ఉరుసు కార్యక్రమంలో గత కొన్ని ఏళ్లుగా ఏఆర్ రెహమాన్ పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే ఉరుసు ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేస్తుంది.
Similar News
News October 30, 2025
యువతను ఉద్యోగాల సృష్టి దిశగా నడిపించే “స్టార్టప్ కడప హబ్”

యువత ఉద్యోగాల సృష్టి దిశగా ఎదగాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం స్ఫూర్తిదాయకమని నీతి ఆయోగ్ జాయింట్ సెక్రటరీ, ఆకాంక్షిత జిల్లా ప్రాబరీ అధికారి సిద్ధార్థ్ జైన్ అన్నారు. కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రూ.10 కోట్ల “స్టార్టప్ కడప హబ్” పనులను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరితో కలిసి పరిశీలించారు. ఈ భవనం 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో నిర్మాణం అవుతుందని కలెక్టర్ తెలిపారు.
News October 29, 2025
పుష్పగిరిలో జైనమత ఆనవాళ్లు

పుష్పగిరిలో 10 శతాబ్దం నాటి జైన పాదుకలు వెలుగు చూశాయి. జిల్లాకు చెందిన రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తాజాగా ఈ జైన పాదుకలను గుర్తించారు. పుష్పగిరిలో వైష్ణవ, శైవ, వీరశైవ, శాక్తేయ, అఘోర, కాపాళిక మత శాఖలకు సంబంధించిన ఆలయాలకు, చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా పెర్కొనబడుతోంది. తాజాగా జైన పాదుకల ఆవిష్కరణతో పుష్పగిరి మత సాంస్కృతిక చరిత్రకు జైనమత ఆనవాళ్లు కూడా తోడయ్యాయని ఆయన తెలిపారు.
News October 29, 2025
కడప జిల్లాలోని కాలేజీలకు కూడా ఇవాళ సెలవు

కడప జిల్లాపై తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని డీఈవో శంషుద్దీన్ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఇవాళ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


