News November 15, 2024

VZM: ‘రాజీకు వచ్చే క్రిమినల్ కేసులను గుర్తించండి’

image

రాజీకు వచ్చే అన్ని క్రిమినల్ కేసులను గుర్తించి వాటిని జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్ సూచించారు. పోలీస్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు. రాజీయే రాజమార్గమని, ఈ విధానం ద్వారా కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని చెప్పారు.

Similar News

News September 16, 2025

పేద‌రిక నిర్మూల‌నే పీ-4 ల‌క్ష్యం: VZM జేసీ

image

పేద‌రిక నిర్మూల‌నే పీ-4 కార్య‌క్ర‌మం ప్ర‌ధాన‌ ల‌క్ష్య‌మ‌ని జేసీ ఎస్‌.సేతు మాధ‌వ‌న్‌ స్ప‌ష్టం చేశారు. మార్గ‌ద‌ర్శులు బంగారు కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకొని, వారిని పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చే విధంగా కృషి చేయాల‌ని కోరారు. పీ-4 కార్య‌క్ర‌మం, బంగారు కుటుంబాలు, మార్గ‌ద‌ర్శుల పాత్ర‌పై స‌చివాల‌యం నుంచి ఎంపిక చేసిన ఎంవోటీ, టీవోటీలకు క‌లెక్ట‌రేట్లో మంగ‌ళ‌వారం శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

News September 16, 2025

VZM: ప్రత్యేక అలంకరణలో పైడిమాంబ

image

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారిని ఆలయ అర్చకులు సుందరంగా అలంకరించారు. మంగళవారం సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు చదురు గుడిలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించి వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సిరిమానోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు శోభిల్లుతున్నారు.

News September 16, 2025

VZM: మ‌హిళ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు వ‌రం

image

మ‌హిళ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు స్వ‌స్త్ నారీ స‌శ‌క్తి ప‌రివార్ అభియాన్ ప‌థ‌కం ఎంతో దోహ‌దం చేస్తుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతు మాధ‌వన్ అన్నారు. ఈ ప‌థ‌కానికి సంబంధించి గోడ ప‌త్రిక‌ను ఆయ‌న క‌లెక్ట‌రేట్లో సోమ‌వారం ఆవిష్క‌రించారు. దీని ద్వారా వివిధ ర‌కాల స్క్రీనింగ్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, అవ‌స‌ర‌మైన‌వారికి త‌గిన వైద్య స‌దుపాయాన్ని అందించాల‌ని సూచించారు.