News November 15, 2024
అరకు కాఫీని మార్కెటింగ్ చేయనున్న టాటా సంస్థ..!

అల్లూరి జిల్లాలోని అరకు కాఫీ ప్రాధాన్యతను గుర్తించి, ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన టాటా సంస్థ, మార్కెటింగ్ చేయడానికి ముందుకు రావడం హర్షణీయమని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో టాటా సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. టాటా సంస్థకు కావలసినంత మేర కాఫీ గింజలను అందించడం జరుగుతుందని చెప్పారు. సంస్థ ఆశించిన స్థాయిలో గింజలు గ్రేడింగ్ చేయిస్తామని కలెక్టర్ తెలిపారు.
Similar News
News July 8, 2025
ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు

ఎంవీపీ కాలనీ ఒకటో సెక్టార్‌లో ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు ఏర్పాటు చేశారు. స్థానికంగా కొందరు మిత్రులు కలసి గిరిప్రదక్షిణ భక్తుల కోసం దీనిని నిర్మించారు. ఇందులో వేంకటేశ్వర స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ఇక్కడ ప్రసాద వితరణతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
News July 8, 2025
గిరి ప్రదక్షిణకు మహా ‘గట్టి’ ఏర్పాట్లు సుమా..!

గిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హనుమంతువాక నుంచి వెంకోజీపాలెం వరకూ జాతీయ రహదారిపై పాదచారుల కోసం చేసిన ఏర్పాటు చూస్తే.. చిన్న పాటి కర్ర పాతి, దానికి సన్నని రిబ్బన్ కట్టి, వాహనాలు ఇటు రాకుండా, పాదచారులు అటు వెళ్లకుండా విభజన చేశారు. లక్షల్లో నడిచే ఈ దారిలో ట్రాఫిక్ కూడా ఎక్కువే. ఇంత ‘గట్టి’ ఏర్పాట్లు చేసిన అధికారులను ఎలా అభినందించాలో తెలియడం లేదంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు.
News July 8, 2025
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ

విశాఖ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ మెమో ఉత్తరులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం మెమో పత్రాలను లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్, ఏపీయూడబ్ల్యూజే, జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ సంఘాల నాయకులకు డీఈవో ప్రేమ్ కుమార్ అందజేశారు. దీనిపై పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.