News November 15, 2024
తుఫాను వెళ్లే దారేది.. పసిగడుతున్న AI

వాతావరణ పరిస్థితులపై ఇటీవల సంప్రదాయ అంచనా విధానాలతో పోలిస్తే AI ఇస్తున్న కచ్చితమైన అంచనాలు నిపుణుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. జులైలో బెరిల్ హరికేన్ దక్షిణ మెక్సికో నుంచి దక్షిణ టెక్సాస్ వైపు పయనిస్తుందని ఇతర విధానాల కంటే Google DeepMind’s GraphCast వారం ముందే పసిగట్టడం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. అయితే వీటికి ఫిజిక్స్ తెలియదని, సంప్రదాయ విధానాలతోపాటు వీటిని వాడుకోవచ్చంటున్నారు.
Similar News
News January 9, 2026
హీరో నవదీప్‌పై డ్రగ్స్ కేసు కొట్టివేత

టాలీవుడ్ హీరో నవదీప్‌కు TG హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన డ్రగ్స్ కేసును న్యాయస్థానం కొట్టేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పేర్కొంది. కాగా 2023లో నవదీప్‌పై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అధికారులు పలుమార్లు ఆయనను విచారించారు.
News January 9, 2026
గోల్డెన్ గ్లోబ్స్ 2026.. ప్రజెంటర్‌గా ప్రియాంకా చోప్రా

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరవనున్నారు. లాస్ ఏంజెలిస్‌లో జనవరి 11న జరగబోయే 83వ Golden Globes 2026లో ఆమె ప్రజెంటర్‌గా కనిపించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ప్రియాంకతో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా అవార్డులు అందజేయనున్నారు. కామెడీ స్టార్ నిక్కీ గ్లేజర్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది సినిమాలతో పాటు పాడ్‌కాస్ట్ విభాగాల్లోనూ అవార్డులు ఇవ్వనుండటం విశేషం.
News January 9, 2026
నా మాటలే సున్నితం.. చేతలు గట్టిగా ఉంటాయి: పవన్

AP: ప్రజలను అభద్రతాభావానికి గురిచేసేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. తన మాటలు సున్నితంగా ఉన్నా చేతలు గట్టిగా ఉంటాయని హెచ్చరించారు. ‘అభివృద్ధి విషయంలో రాజకీయ విమర్శను స్వాగతిస్తా. కానీ కులాలు, మతాల మధ్య గొడవ పెట్టాలని చూస్తే నేను వ్యక్తిగతంగా ఫోకస్ చేస్తా. సీఎం, నాతో సహా ఎవరూ వ్యవస్థకు అతీతం కాదు. నాకు ముందుకెళ్లే ఆలోచన తప్ప ఓటమి భయం లేదు’ అని చెప్పారు.


