News November 15, 2024
IIT మద్రాస్‌తో ప్రభుత్వం ఒప్పందాలు

8 విభాగాలకు సంబంధించి సాంకేతికత, పరిశోధనల ఫలితాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా IIT మద్రాస్‌తో AP ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అమరావతిలో డీప్ టెక్ పరిశోధన, స్కిల్ డెవలప్‌మెంట్‌లో నాణ్యత పెంచేలా సహకారం తీసుకోనుంది. విద్యాశాఖ, IT, పరిశ్రమలు, క్రీడలు, RTGS అంశాల్లోనూ ప్రభుత్వం ఆ సంస్థతో కలిసి పనిచేయనుంది.
Similar News
News April 18, 2026
రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.
News April 18, 2026
హార్ముజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్

హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ షాకిచ్చింది. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US అడ్డుకోవడంపై మండిపడింది. ఇది ఆగేవరకు తమ నియంత్రణ కొనసాగుతుందని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా తన హామీలను విస్మరించిందని ఫైరయ్యింది.
News April 18, 2026
GOOD NEWS: చిన్నారి పునర్వికకు పునర్జన్మ

స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాలు నిలిచాయి. <<19232308>>దాతల<<>> ద్వారా సేకరించిన ₹10కోట్లు, ప్రభుత్వం తరఫున మరో ₹6కోట్లు వెచ్చించి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను ఇవాళ అందించారు. ‘ఇచ్చిన <<19240414>>మాట<<>> నిలబెట్టుకున్నాం. చిట్టి తల్లి నూరేళ్లు వర్ధిల్లు’ అని పునర్వికతో ఉన్న ఫొటోలను మంత్రి లోకేశ్ షేర్ చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మానవత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


