News November 15, 2024
కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్
సౌతాఫ్రికాతో చివరిదైన నాలుగో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. 2-1తో ముందంజలో ఉన్న IND ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది.
IND: శాంసన్, అభిషేక్, సూర్య, తిలక్, హార్దిక్, అక్షర్, రమన్‌దీప్, రింకూ సింగ్, బిష్ణోయ్, వరుణ్, అర్ష్‌దీప్
SA: రికెల్టన్, హెండ్రిక్స్, మార్క్రమ్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, సిమెలనే, కోయెట్జీ, మహారాజ్, సిపమ్లా
Similar News
News November 16, 2024
RECORD: సౌతాఫ్రికా ‘ఘోర’ పరాజయం
T20 క్రికెట్లో సౌతాఫ్రికా అత్యంత ఘోర పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చివరి మ్యాచ్‌లో సఫారీ జట్టును భారత్ 135 రన్స్ తేడాతో ఓడించింది. SAకు ఇదే అత్యంత భారీ ఓటమి. 2023లో ఆస్ట్రేలియా చేతిలో 111 రన్స్, 2020లోనూ ఆసీస్ చేతిలోనే 106 రన్స్ తేడాతో ఓడింది. అటు భారత్‌కు పరుగుల పరంగా 3వ అతి పెద్ద విజయం. భారత్ 2023లో NZపై 168 రన్స్, 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల విజయం సాధించింది.
News November 16, 2024
చిన్నారుల మృతి బాధాకరం: CM యోగి
UPలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో జరిగిన <<14624059>>ప్రమాదంలో<<>> చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని CM యోగి అన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులను ఆదేశించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
News November 16, 2024
సంజూ శాంసన్ వరల్డ్ రికార్డ్
టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ టీ20ల్లో మూడు సెంచరీలు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచారు. మరే క్రికెటర్ ఒకే ఏడాదిలో మూడు శతకాలు బాదలేదు. అలాగే టీ20ల్లో నాలుగు సెంచరీలు బాదిన తొలి భారత వికెట్ కీపర్‌గా ఆయన ఘనత సాధించారు. గతంలో కేఎల్ రాహుల్ రెండు సెంచరీలు సాధించారు. ఇషాన్ కిషన్ ఒక శతకం బాదారు.