News November 15, 2024
ఆ సంస్థలతో మళ్లీ చర్చలు: నారాయణ

AP: అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని సబ్ కమిటీ చర్చలు జరిపింది. గతంలో ఏయే సంస్థలకు ఎంతెంత భూములు కేటాయించారనే దానిపై స్టడీ చేయడంతో పాటు ఆయా సంస్థలతో చర్చలు జరపాలని CRDA అధికారులను ఆదేశించింది. ‘గత ప్రభుత్వం 3 ముక్కలాటతో భూములు పొందిన సంస్థలు నిర్మాణాలకు ముందుకు రాలేదు. మా ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలు ప్రారంభిస్తామని ఆ సంస్థలు ముందుకొస్తున్నాయి’ అని నారాయణ చెప్పారు.
Similar News
News November 5, 2025
CCRHలో 90 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News November 5, 2025
భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.
News November 5, 2025
మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


