News November 15, 2024

నెల రోజులు నాన్ వెజ్ మానేస్తే..

image

కొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. రోజుకోసారైనా రుచి చూడాలని తహతహలాడుతుంటారు. కానీ నెలరోజులపాటు మాంసాహారం తినడం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నెలపాటు మానేస్తే అజీర్ణం, జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు సమస్య తగ్గి, ఎముకల బలం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఆర్థరైటిస్, వాపులు, నొప్పులు తగ్గుతాయని అంటున్నారు.

Similar News

News November 16, 2024

మరోసారి తండ్రైన రోహిత్‌.. టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్?

image

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్‌శర్మ మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి రితిక కాసేపటి క్రితం పిల్లాడికి జన్మనిచ్చారు. ఇప్పటికే వీరికి కూతురు సమైరా ఉన్నారు. ఇదిలా ఉంటే జూ.రోహిత్ వచ్చేస్తున్నాడని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ నెల 22న ఆస్ట్రేలియాతో జరగాల్సిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రోహిత్ అందుబాటులో ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే భారత జట్టుకు గుడ్ న్యూస్ కానుంది.

News November 16, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: నవంబర్ 16, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:06
✒ సూర్యోదయం: ఉదయం 6:22
✒ దుహర్: మధ్యాహ్నం 12:01
✒ అసర్: సాయంత్రం 4:04
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:40
✒ ఇష: రాత్రి 6.55
>> నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 16, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: నవంబర్ 16, శనివారం
✒ బ.పాడ్యమి: రా.11.50 గంటలకు
✒ కృత్తిక: రా.07.28 గంటలకు
✒ వర్జ్యం: 08.41-10.07 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.06.12-06.58 గంటల.