News November 15, 2024

సహాయం అందించాలని కేంద్రాన్ని కోరాం: లావు

image

వ్యవసాయంపై ఆధారపడిన వానిలో గోదావరి, పెన్నా ముఖ్యమైన ప్రాజెక్టులని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై మాట్లాడామని చెప్పారు. ఆర్థిక రంగంలో జరిగే మార్పులపై విదేశాంగశాఖ మంత్రితో సీఎం చర్చించారని, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామన్నారు.

Similar News

News September 15, 2025

మహిళల ఆరోగ్యంపై శిబిరాలు: DMHO

image

‘స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్’ పేరిట జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్టు డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి తెలిపారు. ఈ శిబిరాలలో మహిళలకు గుండె జబ్బులు, మధుమేహం, గర్భాశయ క్యాన్సర్, రక్తహీనత వంటి వ్యాధులను గుర్తించి, చికిత్సలు అందిస్తారు. గర్భిణులకు పరీక్షలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

News September 15, 2025

సమయపాలన, క్రమశిక్షణ పాటించాలి: ఎస్పీ వకుల్

image

పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రోల్ కాల్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి పోలీస్ సిబ్బంది చక్కని యూనిఫామ్ ధరించి, సమయపాలన పాటించాలని, ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ సూచించారు.

News September 15, 2025

పులిపాటి వెంకటేశ్వర్లు మన తెనాలి వారే

image

తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు పులిపాటి వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా తెనాలిలో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచుకున్న పులిపాటి తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. నాటకాలలో అర్జునుడు, నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి, తదితర పాత్రలను పోషించడమే కాక,1932లో సినిమా రంగంలో ప్రవేశించి చింతామణి, హరిశ్చంద్ర తదితర 12 సినిమాల్లో నటించారు.