News November 16, 2024

HEADLINES

image

☞ AP: ఆడబిడ్డల రక్షణ బాధ్యత మాది: సీఎం చంద్రబాబు
☞ AP: జగన్ ఏ పథకాన్నీ ఆపలేదు: కన్నబాబు
☞ AP: త్వరలో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: లోకేశ్
☞ TG: సంక్రాంతి నుంచి సన్నబియ్యం: తుమ్మల
☞ TG: తెలంగాణ తిరగబడుతుంది: KTR
☞ TG: KTR, హరీశ్ ఒకే పార్టీలో ఉండరు: కాంగ్రెస్
☞ శబరిమల అయ్యప్ప దర్శనం ప్రారంభం
☞ IPL వేలంలో లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితా విడుదల

Similar News

News November 16, 2024

నిరసనలకు ఆర్టీసీ, సీపీఎస్ ఉద్యోగుల పిలుపు

image

AP: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ మండిపడింది. ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని డిపోలు, జోనల్ వర్క్‌షాపుల వద్ద నిరసనలు చేయనున్నట్లు ప్రకటించింది. కూటమి నేతలు హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్, జీపీఎస్‌ స్థానంలో కొత్త పింఛన్ పథకాన్ని తీసుకురావాలనే డిమాండ్‌తో డిసెంబర్ 10న ఛలో విజయవాడ నిర్వహించనున్నట్లు సీపీఎస్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది.

News November 16, 2024

నేడు, రేపు ‘మహా’లో CM రేవంత్ ప్రచారం

image

TG: సీఎం రేవంత్ నేడు, రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఉ.10గంటలకు HYD నుంచి బయలుదేరుతారు. చంద్రాపుర్‌లో మొదలుపెట్టి రాజురా, డిగ్రాస్, వార్ధా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారు. రేపు నయాగావ్, భోకర్, సోలాపుర్‌ల్లో ప్రచార సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు.

News November 16, 2024

పాకిస్థాన్‌కు మరో దెబ్బ.. BCCI బాటలోనే కబడ్డీ టీమ్

image

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. PAKలో జరిగే ఫ్రెండ్లీ గేమ్స్‌ కోసం భారత కబడ్డీ జట్టును పంపేది లేదని తేల్చింది. దీంతో పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. కాగా భారత ప్రభుత్వ నిర్ణయంతో పాకిస్థాన్ ఆదాయానికి గండి పడినట్లయింది. సెక్యూరిటీ కారణాల వల్లే ఆటగాళ్లను పంపించట్లేదని కేంద్రం అంటోంది.