News November 16, 2024

నవంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

* 1966: జాతీయ పత్రికా దినోత్సవం
* 1908: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం.
* 1923: తెలుగు సినీ నటుడు కాంతారావు జననం.(ఫొటోలో)
* 1963: భారతీయ సినీ నటి మీనాక్షి శేషాద్రి జననం.
* 1973: తెలుగు, తమిళ సినీ నటి ఆమని జననం.
* 1973: భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం.

Similar News

News November 16, 2024

KTR అరెస్ట్‌ని బీజేపీ అడ్డుకోవడం లేదు: కిషన్ రెడ్డి

image

TG: KTR అరెస్ట్‌ని BJP అడ్డుకుంటోందన్న విమర్శలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన KTR కేంద్ర మంత్రులెవరినీ కలవలేదని స్పష్టం చేశారు. గవర్నర్ ఏ ఫైల్‌పై సంతకం పెడుతున్నారనేది కేంద్రం పర్యవేక్షించదని వెల్లడించారు. మాజీ సీఎం KCR తరహాలోనే CM రేవంత్ రెడ్డి కూడా దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అబద్ధపు, అరాచక పాలన కొనసాగిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.

News November 16, 2024

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మన CMలు

image

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల CMలు అక్కడ వేర్వేరుగా పర్యటించనున్నారు. చంద్రబాబు ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వెళ్లి ఎన్డీయే తరఫున ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం10గంటలకు చంద్రాపూర్ వెళ్లే రేవంత్ నేడు, రేపు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార‌సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఏపీ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కూడా 16, 17తేదీల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

News November 16, 2024

రేపు, ఎల్లుండి గ్రూప్-3 పరీక్షలకు సర్వం సిద్ధం

image

TG: వివిధ శాఖల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి రేపు, ఎల్లుండి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలను TGPSC సిద్ధం చేసింది. 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రేపు ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2, 18న ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-3 ఎగ్జామ్ జరగనుంది. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని TGPSC సూచించింది.