News November 16, 2024
IIT మద్రాసుతో 8 ఒప్పందాలు: మంత్రి లోకేశ్
AP: రాష్ట్ర ప్రభుత్వం IIT మద్రాసుతో 8 రకాల ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. CRDA, మ్యారీ టైం బోర్డు, స్కిల్ డెవలప్‌మెంట్, విద్య, ఇన్వెస్టిమెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, IT, RTGS శాఖలతో IIT మద్రాస్ ఒప్పందాలు కుదిరాయని ఆయన అన్నారు. ఐఐటి మద్రాసు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించిన అనంతరం కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
Similar News
News November 16, 2024
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మన CMలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల CMలు అక్కడ వేర్వేరుగా పర్యటించనున్నారు. చంద్రబాబు ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వెళ్లి ఎన్డీయే తరఫున ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం10గంటలకు చంద్రాపూర్ వెళ్లే రేవంత్ నేడు, రేపు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారసభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఏపీ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కూడా 16, 17తేదీల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
News November 16, 2024
రేపు, ఎల్లుండి గ్రూప్-3 పరీక్షలకు సర్వం సిద్ధం
TG: వివిధ శాఖల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి రేపు, ఎల్లుండి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలను TGPSC సిద్ధం చేసింది. 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రేపు ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2, 18న ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-3 ఎగ్జామ్ జరగనుంది. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని TGPSC సూచించింది.
News November 16, 2024
ఈ విజయం ఎప్పటికీ నాతో ఉంటుంది: సూర్య
దక్షిణాఫ్రికాపై నిన్న సాధించిన టీ20 సిరీస్ విజయం తనతో ఎప్పటికీ నిలిచిపోతుందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్ గెలవడం అంత సులువు కాదని గుర్తుచేశారు. ‘సౌతాఫ్రికా పర్యటన ఎప్పుడైనా సవాలే. యువ జట్టుతో ఇక్కడికొచ్చి ఇలా గెలుపొందడం అద్భుతం. ఫలితం గురించి ఆలోచించకుండా ఆడాం’ అని తెలిపారు. భారత్ ఈ ఏడాది ఆడిన 26 టీ20ల్లో 24 మ్యాచుల్లో గెలవడం విశేషం.