News November 16, 2024
విజయవాడలో భారీ సైబర్ మోసం.. రూ.1,25,10,000 మాయం

విజయవాడలో భారీ మోసం వెలుగు చూసింది. విజయవాడకు చెందిన నర్ర నాగశ్రీ (సాఫ్ట్వేర్ ఇంజినీర్) అనే మహిళకు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల నుంచి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. భయపడిన ఆమె వెంటనే తన అకౌంట్లో రూ.కోటీ పాతిక లక్షల పదివేల నగదును సైబర్ నేరగాళ్ల ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇది మోసం అని తెలుసుకున్న బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News April 18, 2026
కృష్ణా: పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన మహిళలు

మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన ఘటన కృష్ణా(D) పెడనలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ పరిధిలో గృహ సముదాయాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్న మహిళలను అదుపులోకి తీసుకున్నామని SI బషీర్ చెప్పారు. ఆటలో పాల్గొన్న నలుగురు మహిళలు, ఇద్దరు పురుషుల నుంచి రూ.47,750 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. దొరికింది కొంత నగదే.. అక్కడి మహిళలు రూ.లక్షల్లో పందేలు కాస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి.
News April 18, 2026
ఇండస్ట్రియల్ నేరగాళ్లకు SP హెచ్చరికలు

బాపులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా (APIIC)నుSP విద్యాసాగర్ నాయుడు శుక్రవారం పరిశీలించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు, దొంగతనాలు, మహిళల ఉద్యోగుల భద్రత, బహిరంగ మద్యపానం వంటి సమస్యలపై చర్చించారు. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. వేధింపులు, దొంగతనాలు, అక్రమ మద్యం సేవపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు.