News November 16, 2024
లేడీస్ ‘ఫస్ట్’
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరిగిన ఫస్ట్ ఫేజ్ పోలింగ్‌లో మహిళా ఓటర్లే ఎక్కువశాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. పురుషుల కంటే 4.8శాతం ఎక్కువగా ఆడవారి ఓట్లే నమోదయ్యాయని తెలిపింది. కాగా ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో 66.66% పోలింగ్ నమోదైంది. 2019 పోలింగ్ కంటే 2.75శాతం అధికమని ఈసీ వివరించింది.
Similar News
News November 16, 2024
సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్యం విషమం
AP: సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు HYDకి బయల్దేరారు. మంత్రి లోకేశ్ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు.
News November 16, 2024
ప్రపంచస్థాయి మ్యూజిక్ స్కూల్‌ని ప్రారంభించడం నా కల: తమన్
ప్రపంచస్థాయి మ్యూజిక్ స్కూల్‌ను ప్రారంభించాలనేది తన కల అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంగీత పాఠశాల నా కల. ఆర్థికంగా వెనుకబడిన వారికి అందులో ఉచితంగా సంగీతం నేర్పిస్తాను. సంగీతం ఉన్నచోట నేరాలు తక్కువగా ఉంటాయి. మరో మూడేళ్లలో మన వద్దే నిర్మిస్తాను. స్థలం ఇవ్వమని కాకుండా ప్రభుత్వాలు సాయమేమైనా చేస్తాయేమో అడుగుతాను’ అని పేర్కొన్నారు.
News November 16, 2024
విమానంలో బాంబు ఉందంటూ ప్రయాణికుడి కేకలు
TG: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న విమానంలో ఎక్కిన ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ కేకలు వేశాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకొని, విమానంలో తనిఖీలు చేశారు. బాంబు లేదని తేల్చారు.