News November 16, 2024
థ్రిల్లర్ మూవీలో చైతూ-పూజ?
‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో హీరోహీరోయిన్లుగా నాగ చైతన్య, పూజా హెగ్డే నటిస్తారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్ టాక్. ‘ఒక లైలా కోసం’ మూవీలో వీరిద్దరూ జంటగా నటించిన విషయం తెలిసిందే. కాగా చైతూ, సాయి పల్లవి కాంబోలో చందూ మొండేటి రూపొందిస్తున్న తండేల్ మూవీ FEB 7న విడుదల కానున్న విషయం తెలిసిందే.
Similar News
News November 16, 2024
‘బ్రాండ్ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ: CM చంద్రబాబు
PM నరేంద్రమోదీ ‘బ్రాండ్ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేశారని AP CM చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రాండ్ బలంగా ఉంటేనే అద్భుతాలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోదీ చేసింది అదేనన్నారు. ఇప్పుడాయన స్పష్టమైన విజన్, పాలసీ, డైరెక్షన్, ప్రాసెస్‌తో వికసిత్ భారత్ 2047 వైపు వెళ్తున్నారని వెల్లడించారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నం.1 ఎకానమీ అవుతుందనడంలో సందేహం లేదని HTLS 2024లో అన్నారు.
News November 16, 2024
ఆకాంక్షల రెక్కలపై అభివృద్ధి వైపునకు దేశం: మోదీ
భారత్ స్వతంత్ర ఉద్యమ కష్టాల నుంచి ఆకాంక్షల రెక్కలపై అభివృద్ధివైపు దూసుకెళ్తోందని PM మోదీ అన్నారు. ‘పదేళ్ల క్రితం వరకు ఈ జర్నీ ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు అంతా నమ్ముతున్నారు. భారతీయ ప్రమాణాలను ప్రపంచం గుర్తిస్తోంది. బ్రిటిషర్లు వెళ్లాక, ఎమర్జెన్సీ టైమ్, సంస్థలు ప్రభుత్వాలకు దాసోహమైనప్పుడు ప్రజలే ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. పదేళ్లలో దేశ బడ్జెట్ రూ.16L Cr నుంచి రూ.48L Crకు పెరిగింది’ అని అన్నారు.
News November 16, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS మాజీ MLAకు నోటీసులు
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ MLA చిరుమర్తి లింగయ్యతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నేతలకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారుల కోసం వేట కొనసాగుతోంది.