News November 16, 2024

తులసీ.. మీ అంకితభావం ఆకట్టుకుంది: నిర్మల

image

అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమితులైన తొలి హిందూ మహిళ తులసీ గబ్బార్డ్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘సోల్జర్ నుంచి Lt.కల్నల్ వరకు 21 ఏళ్లుగా USకు సేవలందిందించారు. మీతో కలిసి పలు వేదికల్లో పాల్గొనడం సంతోషకరం. మీ ఆలోచనల్లో స్పష్టత, అంకితభావం నన్ను ఆకట్టుకున్నాయి’ అని Xలో పోస్టు చేశారు.

Similar News

News November 16, 2024

ఆధార్ ఉన్నవారికి అలర్ట్

image

మీ ఆధార్ దుర్వినియోగమైందా? లేదా? తెలుసుకోవాలంటే..
* <>uidai.gov.in<<>> పోర్టల్‌లోకి మీ ఆధార్ నంబర్, క్యాప్చా, మొబైల్‌కి వచ్చే OTPతో లాగిన్ అవ్వాలి.
* తర్వాత అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయండి.
* అక్కడ ‘ఆల్’ని సెలెక్ట్ చేసి ‘ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ’పై క్లిక్ చేస్తే మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనే వివరాలు తెలిసిపోతాయి. మీ ఆధార్‌ దుర్వినియోగమైనట్లు తెలిస్తే 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

News November 16, 2024

‘అమరన్’ థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి

image

తమిళనాడులోని తిరునల్వేలిలో ‘అమరన్’ మూవీ ఆడుతున్న థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు 3 పెట్రోల్ బాంబుల్ని హాల్‌పైకి విసరడం సీసీ కెమెరాల్లో నమోదైంది. స్థానికుల మధ్య ఉన్న తగాదాలే దీనికి కారణమని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. సినిమాలో కొన్ని సన్నివేశాలపై తమిళనాట కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News November 16, 2024

అయ్యో.. ఈ తల్లులకు ఎందుకీ కడుపుకోత?

image

UPలోని ఝాన్సీలో మెడికల్ కాలేజీలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది పసిప్రాణాలు బలయ్యాయి. నవమాసాలు మోసి కన్న పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచాలని, ఉన్నతంగా తీర్చిదిద్దాలని అమాయక తల్లులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు తమ పిల్లల కోసం పిల్లల వార్డులోకి వెళుతుంటే సిబ్బంది తమను అడ్డుకున్నారని, చివరికి బిడ్డల డెడ్‌బాడీలను తీసుకొచ్చి ఇచ్చారని ఆ తల్లులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.