News November 16, 2024
కాపురంలో చిచ్చు రేపిన నెహ్రూ కానుక!
బరోడా మహారాణి కోసం నెహ్రూ ఆర్డర్ చేసిన 1951 మోడల్ రోల్స్ రాయిస్ కారు ఓ కాపురంలో చిచ్చు రేపింది. ప్రస్తుతం దాని విలువ రూ.2.5కోట్లుగా ఉంది. అయితే తన తండ్రికి వారసత్వంగా వచ్చిన ఈ కారును కట్నంగా ఇవ్వాలని తన భర్త వేధిస్తున్నట్లు ఓ మహిళ గ్వాలియర్ కోర్టు, ఆపై సుప్రీంను ఆశ్రయించారు. తమది నిజమైన పెళ్లి కాదని, గ్రహదోషం కోసం తనను ఆమె పెళ్లి చేసుకున్నట్లు భర్త చెప్పారు. కట్నంగా కారు అడగలేదని తెలిపారు.
Similar News
News November 16, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS మాజీ MLAకు నోటీసులు
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ MLA చిరుమర్తి లింగయ్యతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నేతలకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారుల కోసం వేట కొనసాగుతోంది.
News November 16, 2024
అమెరికాతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాం: చైనా
USతో చైనా భాగస్వామిగా, మిత్రదేశంగా ఉండాలనుకుంటున్నట్లు చైనా రాయబారి షీ ఫెంగ్ తెలిపారు. హాంకాంగ్‌లో చైనా, అమెరికా అధికారులు పాల్గొన్న ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అమెరికాను దాటాలనో లేక అంతర్జాతీయంగా ఆ స్థానంలోకి రావాలనో చైనా భావించడం లేదు. ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే అపరిమిత ప్రయోజనాలుంటాయి. మన మధ్య ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’ అని పేర్కొన్నారు.
News November 16, 2024
ఎన్కౌంటర్.. నలుగురు మావోల మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. అక్కడ పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.