News November 16, 2024
44 శాతం ఇళ్లలో సర్వే పూర్తి
TG: రాష్ట్రవ్యాప్తంగా 1.16 కోట్ల ఇళ్లకుగాను 51.24 లక్షల(44.1శాతం) నివాసాల్లో సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సర్వేలో 87,807 మంది సిబ్బంది పాల్గొంటున్నారని, 8,788 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సర్వే తీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రజల అభ్యున్నతి కోసమే సర్వే చేస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలవాలి’ అని సూచించారు.
Similar News
News November 16, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS మాజీ MLAకు నోటీసులు
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ MLA చిరుమర్తి లింగయ్యతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నేతలకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారుల కోసం వేట కొనసాగుతోంది.
News November 16, 2024
అమెరికాతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాం: చైనా
USతో చైనా భాగస్వామిగా, మిత్రదేశంగా ఉండాలనుకుంటున్నట్లు చైనా రాయబారి షీ ఫెంగ్ తెలిపారు. హాంకాంగ్‌లో చైనా, అమెరికా అధికారులు పాల్గొన్న ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అమెరికాను దాటాలనో లేక అంతర్జాతీయంగా ఆ స్థానంలోకి రావాలనో చైనా భావించడం లేదు. ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే అపరిమిత ప్రయోజనాలుంటాయి. మన మధ్య ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’ అని పేర్కొన్నారు.
News November 16, 2024
ఎన్కౌంటర్.. నలుగురు మావోల మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. అక్కడ పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.