News November 16, 2024

ఎస్.కోట: మహిళపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం

image

మహిళపై స్కూల్ HM అత్యాచారయత్నం చేసినట్లు ఎస్.కోట పోలీసలు కేసు నమోదు చేసుకున్నారు. సీఐ వీ.ఎన్ మూర్తి వివరాల ప్రకారం.. గంట్యాడ మండలంలోని ఓ మహిళ తన కుమారుడి స్టడీ సర్టిఫికెట్లు సరిదిద్దాలని ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎమ్‌ను కోరారు. సరి చేయడం కోసం బొడ్డవర వెళ్లాలని చెప్పి ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. సమీప తోటల్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేయబోగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో వదిలేశాడు.

Similar News

News March 6, 2026

VZM: ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీ ఆవిష్కరణ

image

ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీను విడుదల చేసి అధికారులకు అందజేశారు. ప్రభుత్వ పరిపాలనలో రోజువారీ కార్యక్రమాలు, పరిపాలన సంబంధిత అంశాలను నమోదు చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డీఆర్‌ఓ మురళీ, తదితరులున్నారు.

News March 5, 2026

VZM: మిషన్ హార్టీ విజన్‌తో ఉద్యాన సాగు విస్తరణ

image

జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో అదనంగా 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

News March 5, 2026

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO

image

వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జీవన రాణి సూచించారు. విజయనగరంలోని తన కార్యాలయం ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత అధికమై ప్రాణాపాయం కలగొచ్చని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, మగత, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలో తిరగకూడదని, తగినంత నీరు తాగాలన్నారు.