News November 16, 2024
NLG: జిల్లాలో 55% సర్వే పూర్తి

నల్గొండ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అధికారులు 5,03,500 కుటుంబాలను గుర్తించారు. ఇప్పటివరకు దాదాపుగా మూడు లక్షల గృహాల్లో ఎన్యూమరేటర్లు సర్వే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలతో పోలిస్తే నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సర్వే వేగంగా ఇప్పటికే 55 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 31, 2026
నల్గొండ జిల్లాలో వింత పొత్తులు

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార కాంగ్రెస్‌ను నిలువరించడమే ధ్యేయంగా ప్రధాన ప్రతిపక్షాలు BRS, BJP చేతులు కలిపినట్లు ప్రచారం జరుగుతోంది. చండూరు, MLG, చౌటుప్పల్ వంటి కీలక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా కొన్నిచోట్ల రహస్య ఒప్పందాలు, మరికొన్ని చోట్ల బహిరంగ మద్దతు తెలుపుతున్నారు. ఈ వింత పొత్తులు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
News January 31, 2026
NLG: సీపీఎం నుంచి అయూబ్ ఖాన్ సస్పెన్షన్

సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మహ్మద్ అయూబ్ ఖాన్‌ను పార్టీ నుంచి తొలగించినట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మిర్యాలగూడలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందనే ప్రాథమిక సభ్యతం నుంచి తొలగిస్తున్నట్లు, అతనికి సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
News January 31, 2026
సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కాంగ్రెస్ కసరత్తు

SRPT మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని ఆర్యవైశ్య సామాజికవర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త మురిశెట్టి లక్ష్మబి భార్య నివేదిత నామినేషన్ దాఖలు చేశారు. రెడ్డి, యాదవ్ వర్గాల మధ్య సమన్వయం కోసం మధ్యేమార్గంగా ఆమెను బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. మొత్తం 48 వార్డుల్లో 12 నుంచి 15 వరకు పటేల్ రమేష్ రెడ్డి వర్గానికి కేటాయించేలా ఒప్పందం కుదిరింది.


