News November 16, 2024

నేడు తరగతుల బహిష్కరణ: R.క‌ృష్ణయ్య

image

TG: రాష్ట్రంలో నేడు తరగతుల బహిష్కరణ చేపట్టనున్నట్లు BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు R.క‌ృష్ణయ్య ప్రకటించారు. ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌, పెండింగ్ ఫీజులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. స్కాలర్‌షిప్‌లను రూ.5,500 నుంచి రూ.20వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏపీలో రూ.20వేలు, కర్ణాటకలో రూ.15వేలు ఇస్తున్నారని తెలిపారు.

Similar News

News November 16, 2024

ఒకేసారి ఓలా, ర్యాపిడోలో రైడ్ బుకింగ్.. చిక్కులు తెస్తున్న కొత్త ట్రెండ్

image

నగరాల్లో ఓ కొత్త ట్రెండ్ ఆటోడ్రైవర్లకు ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. కొందరు కస్టమర్లు ఓలా, ర్యాపిడో రెండిట్లోనూ రైడ్ బుక్‌చేస్తున్నారట. తక్కువ ఛార్జ్ లేదా త్వరగా వచ్చిన ఆటో ఎక్కేసి వెళ్తున్నారని సమాచారం. దీంతో తమకు టైమ్, పెట్రోల్ వేస్ట్ అవుతోందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. బిజీటైమ్‌లో తక్కువ దూరానికి వాళ్లు వేసే ఛార్జీల దెబ్బకు ఇలా చేయడంలో తప్పేముందని కస్టమర్ల వాదన. దీనికి పరిష్కారం ఏంటంటారు?

News November 16, 2024

హైదరాబాద్‌కు బయల్దేరిన చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయల్దేరారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం <<14625625>>విషమించిన<<>> విషయం తెలిసిందే. దీంతో ఆయన నేరుగా AIG ఆసుపత్రికి వెళ్లనున్నారు. మరోవైపు నారా లోకేశ్ విజయవాడ నుంచి ఆసుపత్రికి చేరుకున్నారు.

News November 16, 2024

మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?: కేటీఆర్

image

TG: మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ ‘కేసీఆర్, బీఆర్ఎస్‌ను ఫినిష్ చేస్తామని రేవంత్ అంటున్నారు. గతంలో ఇలా అన్న వాళ్లే తెలంగాణలో లేకుండా పోయారని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే’ అని స్పష్టం చేశారు.