News November 16, 2024
నేటి నుంచి డీఎస్సీ ఉచిత శిక్షణ
AP: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లలో నేటి నుంచి డీఎస్సీకి ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. వారికి ట్రైనింగ్ సమయంలో నెలకు ₹1,500 స్టైఫండ్, మెటీరియల్ కోసం ₹1,000 ఇస్తామన్నారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా DSCని విడుదల చేస్తామని తెలిపారు. కాగా ప్రభుత్వం 5,200 మంది BC, SC, STలకు, 520 మంది EWS అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది.
Similar News
News November 16, 2024
హైదరాబాద్‌కు బయల్దేరిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయల్దేరారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం <<14625625>>విషమించిన<<>> విషయం తెలిసిందే. దీంతో ఆయన నేరుగా AIG ఆసుపత్రికి వెళ్లనున్నారు. మరోవైపు నారా లోకేశ్ విజయవాడ నుంచి ఆసుపత్రికి చేరుకున్నారు.
News November 16, 2024
మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?: కేటీఆర్
TG: మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ ‘కేసీఆర్, బీఆర్ఎస్‌ను ఫినిష్ చేస్తామని రేవంత్ అంటున్నారు. గతంలో ఇలా అన్న వాళ్లే తెలంగాణలో లేకుండా పోయారని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే’ అని స్పష్టం చేశారు.
News November 16, 2024
సనాతనాన్ని రక్షించడానికే శివసేన- జనసేన: పవన్
శివాజీ మహారాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతనాన్ని రక్షించడానికే శివసేన- జనసేన ఆవిర్భవించాయని చెప్పారు. ఈ 2పార్టీలు అన్యాయంపై పోరాడతాయని తెలిపారు. జాతీయభావం, ప్రాంతీయతత్వం తమ పార్టీల సిద్ధాంతం అని వివరించారు. మహాయుతి తరఫున మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో ప్రచారం నిర్వహించిన పవన్ బాల సాహెబ్ ఠాక్రే నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడించారు.