News November 16, 2024
ప్రపంచస్థాయి మ్యూజిక్ స్కూల్‌ని ప్రారంభించడం నా కల: తమన్
ప్రపంచస్థాయి మ్యూజిక్ స్కూల్‌ను ప్రారంభించాలనేది తన కల అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంగీత పాఠశాల నా కల. ఆర్థికంగా వెనుకబడిన వారికి అందులో ఉచితంగా సంగీతం నేర్పిస్తాను. సంగీతం ఉన్నచోట నేరాలు తక్కువగా ఉంటాయి. మరో మూడేళ్లలో మన వద్దే నిర్మిస్తాను. స్థలం ఇవ్వమని కాకుండా ప్రభుత్వాలు సాయమేమైనా చేస్తాయేమో అడుగుతాను’ అని పేర్కొన్నారు.
Similar News
News November 16, 2024
కానిస్టేబుల్ ఉద్యోగాలు.. వారికి శుభవార్త
AP: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో హోంగార్డులకు భారీ ఊరట లభించింది. తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా వారికి దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని APSLPRBని కోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
News November 16, 2024
ఎంపీ అవినాశ్ పీఏ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
AP: సోషల్ మీడియా పోస్టుల విషయంలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు 41-A నోటీసులు అంటించారు. విచారణకు రావాలని పేర్కొంటూ నోటీసులిచ్చేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం రాఘవరెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. వర్రా రవీంద్రా రెడ్డి కేసులో ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వివేక్‌లకు నోటీసులు జారీ చేశారు.
News November 16, 2024
మేం నలుగురం అయ్యాం: రోహిత్ శర్మ
ఒక్కరు కాస్త నలుగురం అయ్యామని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఒకరు WPLకు, మరొకరు IPLకు పనికి వస్తారని కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇవాళ రోహిత్-రితిక దంపతులకు మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరికి కూతురు సమైరా ఉన్నారు.