News November 16, 2024
HYD: మీ పట్టుదలకు సలాం..! లక్ష్యంపై కసి అంటే ఇదే!

అన్ని బాగున్నా.. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ప్రస్తుత రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద జరిగిన క్రీడా పోటీల్లో ఏకంగా దివ్యాంగులు బాస్కెట్ బాల్ క్రీడలో సత్తా చాటి వారెవ్వా అనిపించారు. క్రీడాకారుల పట్టుదలను చూసిన ప్రజలు సలాం కొట్టారు. ఇది కదా.. అసలైన పోటీ అంటే, అనుకున్న కల కోసం కాళ్లు లేకున్నా కడదాకా పోరాడుతామని రుజువు చేశారని వారిని అభినందించారు.
Similar News
News April 17, 2026
సరూర్‌నగర్‌లో 14 చెరువుల సమాధి.. రేపటి గతేంటి? (4)

నగరంలో జలవనరుల విధ్వంసం భయంకరంగా ఉంది. సరూర్‌నగర్ మం.లోనే 14 చెరువులు పూర్తిగా అదృశ్యమయ్యాయి. మీరాలం ట్యాంక్ పరిధిలో 9 చెరువులు నామరూపాల్లేకుండా పోయాయి. మరో 20 చెరువులు వెంచర్ల మధ్య ఊపిరి కోల్పోతున్నాయి. నిజాం రికార్డులను బయటకు తీస్తే కబ్జాదారుల అసలు రంగు బయటపడుతుంది. ఇలాగే వదిలేస్తే చెరువులు కనిపించవిక. <<19672915>>వారసత్వ సంపదను<<>> ప్లాట్లుగా మార్చే హక్కు ఎవరిచ్చారని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
News April 17, 2026
HYD: Instaలో కూతురి ఫేక్ అకౌంట్.. తండ్రికి అశ్లీల వీడియోలు!

మేడిపల్లి PS పరిధిలో సైబర్ కిరాతకుల వికృత చేష్టలు వెలుగుచూశాయి. కాచవానిసింగారం దివ్యానగర్‌కు చెందిన వ్యక్తి(50) కుమార్తె పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించారు. అతనికి అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులకు దిగారు. అంతటితో ఆగకుండా వాటిని బంధుమిత్రులకు పంపించి మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 17, 2026
HYD: 3 రక్షణ కమిటీలు.. ఆక్రమణదారుల కోసమేనా? (3)

చెరువులను కాపాడతామని 2018లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వేసిన సర్కారు ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. FTL మార్కింగ్, ఫెన్సింగ్ అంతా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్‌లో బడా బాబులు ఓ చెరువును మింగేస్తుంటే అధికారులు <<19672685>>’పరిశీలిస్తాం’<<>> అంటూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కట్టడాలు కూల్చే ధైర్యం అధికారులకు లేదా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? దీనిపై దర్యాప్తు జరగాల్సిందే!


