News November 16, 2024

అయ్యో.. ఈ తల్లులకు ఎందుకీ కడుపుకోత?

image

UPలోని ఝాన్సీలో మెడికల్ కాలేజీలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది పసిప్రాణాలు బలయ్యాయి. నవమాసాలు మోసి కన్న పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచాలని, ఉన్నతంగా తీర్చిదిద్దాలని అమాయక తల్లులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు తమ పిల్లల కోసం పిల్లల వార్డులోకి వెళుతుంటే సిబ్బంది తమను అడ్డుకున్నారని, చివరికి బిడ్డల డెడ్‌బాడీలను తీసుకొచ్చి ఇచ్చారని ఆ తల్లులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Similar News

News November 7, 2025

చరిత్ర సృష్టించిన శీతల్.. సాధారణ ఆర్చర్లతో పోటీ

image

పారా కాంపౌండ్ ఆర్చరీలో శీతల్ దేవి వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా అనేక పతకాలు గెలిచారు. ఆమె ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. జెడ్డా వేదికగా జరగనున్న ఆసియా కప్ స్టేజ్-3లో పోటీ పడే భారత జట్టుకు ఎంపికయ్యారు. సాధారణ ఆర్చర్ల జట్టులోకి పారా ఆర్చర్ ఎంపికవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ట్రయల్స్‌లో ఆమె ఓవరాల్‌గా 3వ స్థానంలో నిలిచారు.

News November 7, 2025

అరక అరిగిన గరిసె విరుగును

image

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.

News November 7, 2025

పెళ్లి ఏ వయస్సులో చేసుకోవాలి?

image

అమ్మాయిలు 18, అబ్బాయిలు 21 ఏళ్లు దాటాక వివాహం చేసుకోవాలని సనాతన ధర్మం బోధిస్తోంది. దీని వెనుక ఆధ్యాత్మిక ఆంతర్యం కూడా ఉంది. వివాహ జీవితం సక్రమంగా సాగాలంటే శారీరక బంధం ఉంటే సరిపోదు. మానసిక, ఆధ్యాత్మిక పరిణతి కూడా చెంది ఉండాలి. పూర్వం యువతీ యువకులు వేదాలనభ్యసించి, జ్ఞానాన్ని, ధర్మాన్ని తెలుసుకున్నాకే పెళ్లి చేసుకునేవారట. ఇది ధర్మాన్ని నిలబెట్టి, మోక్ష మార్గానికి బాటలు వేస్తుందని నమ్మకం. <<-se>>#Sanathanam<<>>