News November 16, 2024
దయచేసి చావండి.. గూగుల్ ఏఐ సమాధానం
వృద్ధులకు ఎదురయ్యే సవాళ్లపై ప్రశ్న అడిగిన విధయ్‌రెడ్డి అనే విద్యార్థికి గూగుల్ AI బెదిరింపు సమాధానమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ‘ఓ మనిషీ.. నువ్వేమీ స్పెషల్ కాదు. టైమ్, వనరులను వృథా చేస్తావు. సమాజానికి భారం. దయచేసి చావండి’ అని రిప్లై ఇచ్చింది. షాకైన అతను ఫిర్యాదుచేయగా ‘కొన్నిసార్లు నాన్ సెన్సికల్ రెస్పాన్స్‌లతో AIలు ప్రతిస్పందిస్తాయి. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని గూగుల్ పేర్కొంది.
Similar News
News November 16, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన జైపాల్ యాదవ్ విచారణ
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయనను విచారించారు. దాదాపు 2 గంటలకు పైగా విచారణ సాగింది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని జైపాల్ తెలిపారు. కాగా ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు.
News November 16, 2024
కానిస్టేబుల్ ఉద్యోగాలు.. వారికి శుభవార్త
AP: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో హోంగార్డులకు భారీ ఊరట లభించింది. తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా వారికి దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని APSLPRBని కోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
News November 16, 2024
ఎంపీ అవినాశ్ పీఏ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
AP: సోషల్ మీడియా పోస్టుల విషయంలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు 41-A నోటీసులు అంటించారు. విచారణకు రావాలని పేర్కొంటూ నోటీసులిచ్చేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం రాఘవరెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. వర్రా రవీంద్రా రెడ్డి కేసులో ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వివేక్‌లకు నోటీసులు జారీ చేశారు.