News November 16, 2024
పైడి భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికలు వివరాల ప్రకారం.. బైక్-లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే పనిలో స్థానికులు ఉన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News April 17, 2026
శ్రీకాకుళం: 912 పంచాయతీల్లో ఓటర్లు ఎంతమందంటే?

స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. అన్ని పంచాయతీల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. జిల్లాలో 912 పంచాయతీలు ఉండగా, 16,22,067 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో, రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు జిల్లా పంచాయతీల్లో ఉన్నారు. గ్రామస్థాయిలో పారదర్శక ఓటర్ల జాబితా కూర్పుపై ఎన్నికల సంఘం కసరత్తు పెట్టింది.
News April 17, 2026
జనగణనపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

జనగణనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్, ముఖ్య జనగణన అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. స్వీయ-గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. దేశానికి స్వీయ గణన ఎంతో అవసరమన్నారు. మొబైల్ యాప్ (టెక్నాలజీ) వాడుకొనే జనగణనాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.