News November 16, 2024
ప్రొద్దుటూరులో ఈ నెల 18న జాబ్ మేళా

ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 18న ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ, సీడ్యాప్, జిల్లా ఉపాధి కార్యాలయం అధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ అశోక్ బాబు శనివారం తెలిపారు. షిరిడీసాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్, అమర్ రాజ, ఏఐఎల్ డిక్సన్, నవభారత ఫెర్టిలైజర్స్, యంగ్ ఇండియా కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 8, 2025
కులం పేరుతో దూషించిన కేసులో ఇద్దరికి 3 ఏళ్లు జైలు

2019 అక్టోబర్ 11న యర్రగుంట్ల మహాత్మా నగర్‌లో కులం పేరుతో బంగ్లా రమేష్‌పై దూషణ, కాళ్లు చేతులతో తన్ని కట్టెలతో కొట్టిన కేసులో ఇద్దరికి కడప 4వ ఏ డీజే కోర్టు 3 ఏళ్లు సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా 3 నెలల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. ఈ కేసును డీఎస్పీ సూర్యనారాయణ విచారించగా, ప్రత్యేక పీపీ బాలాజీ సమర్థవంతమైన వాదనలు వినిపించినట్లు పేర్కొన్నారు.
News November 7, 2025
సిద్ధవటం: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో కౌలు రైతు వెంకట నరసారెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లికి చెందిన వెంకటనరసారెడ్డికి పంటలు చేతికి అందక రూ.40 లక్షల అప్పులయ్యాయి. ఆ బాధతో పురుగు మందు తాగి APSP 11వ బెటాలియన్ వెనుకవైపు ఉన్న పొలాల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 7, 2025
తొండూరు: పొలాల్లోనే కుళ్లిపోతున్న ఉల్లి గడ్డలు

తుఫాన్ వల్ల ఉల్లి పంట చేతికి అందకుండా పోతుందని జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొండూరు మండలంలో వందల ఎకరాల్లో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇనగలూరు గ్రామానికి చెందిన గుజ్జుల గంగయ్య ఉల్లి పంట పీకి గట్లపై గడ్డలు ఆరబెట్టగా, మరి కొంతమంది ఉల్లి గడ్డలు అమ్మేందుకు కలాల్లో ఆరబోశారు. కీలక దశలో రైతు పాలిట వర్షాలు ఆశనిపాతంలా మారాయ్నారు. నష్టపోయిన ఉల్లి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.


