News November 16, 2024
BGT: టీమ్ ఇండియాకు షాక్!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డట్లు తెలుస్తోంది. ఇండియా-ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్లిప్‌లో క్యాచ్ పడుతుండగా అతడి వేలికి గాయమైనట్లు సమాచారం. గాయం తీవ్రత వల్ల NOV 22 నుంచి జరగనున్న BGT తొలి టెస్ట్‌కు గిల్ దూరమయ్యే అవకాశం ఉందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలిపింది. దీనిపై BCCI అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Similar News
News November 16, 2024
టిడ్కో ఇళ్లలో అక్రమాలపై విచారణ: నారాయణ
AP: గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లలో జరిగిన అక్రమాలపై మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు. లబ్ధిదారుల కేటాయింపు, డీడీల చెల్లింపుల్లో అవకతవకలపై MLAల ఫిర్యాదులతో విచారణ చేస్తున్నామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. అటు 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చామని, గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు నిర్మిస్తామన్నారు. ముందుగా 4.54 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు.
News November 16, 2024
3 నెలలు బస్తీలో ఉండేందుకు సిద్ధం: కిషన్ రెడ్డి
TG: మూసీ పరీవాహకంలో 30 ఏళ్ల క్రితమే బస్తీలు అభివృద్ధి చెందాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బ్యూటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పేదల ఇళ్లు కూల్చివేయడం సబబు కాదన్నారు. తాను 3 నెలలు బస్తీల్లో ఉండటానికైనా సిద్ధమని, అవసరమైతే తన ఇంటిని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవం కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News November 16, 2024
ట్రంప్‌నకు త్వరలో భారతీయ అమెరికన్ల కీలక ప్రతిపాదన
బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై దాడులను అరికట్టేలా ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలని భారతీయ అమెరికన్లు త్వరలో ట్రంప్‌ను కోరనున్నారు. ట్రంప్ ఇటీవల బంగ్లాలో హిందువులపై దాడులను ఖండించిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాపై కఠిన చర్యలకు ట్రంప్ వెనుకాడబోరని ఫిజీషియన్ భరత్ బరాయ్ పేర్కొన్నారు. ఈ విషయమై బంగ్లా స్పందించకపోతే కాంగ్రెస్‌ను కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.